https://oktelugu.com/

ప్రగతి భవన్ టూ గజ్వేల్ రాకపోకలపై ఎమ్మెల్యే సీతక్క పంచ్

తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ తీరును ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. కరోనాను అరికట్టడంలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందనే భావన ప్రజల్లోకి ఇప్పటికే వెళ్లింది. దీనికితోడు కొత్త సచివాలయ నిర్మాణం కోసం టీఆర్ఎస్ చేసిన హడావుడిని ప్రజలంతా గమనించారు. తెలంగాణలోని ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రాజెక్టులపైనే సర్కార్ ఫోకస్ పెట్టడంపై ఇటీవలీ కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read: వరద సాయంలో ఏపీ, తెలంగాణ.. ఏది బెటర్? కరోనాకుతోడు అకాల వర్షాలు కూడా టీఆర్ఎస్ సర్కారును ఇరుకునపెడుతున్నాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : October 18, 2020 / 02:32 PM IST
    Follow us on

    తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ తీరును ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళుతున్నాయి. కరోనాను అరికట్టడంలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందనే భావన ప్రజల్లోకి ఇప్పటికే వెళ్లింది. దీనికితోడు కొత్త సచివాలయ నిర్మాణం కోసం టీఆర్ఎస్ చేసిన హడావుడిని ప్రజలంతా గమనించారు. తెలంగాణలోని ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రాజెక్టులపైనే సర్కార్ ఫోకస్ పెట్టడంపై ఇటీవలీ కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    Also Read: వరద సాయంలో ఏపీ, తెలంగాణ.. ఏది బెటర్?

    కరోనాకుతోడు అకాల వర్షాలు కూడా టీఆర్ఎస్ సర్కారును ఇరుకునపెడుతున్నాయి. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికి వరంగల్ నగరం వరదల్లో మునిగిపోయింది. పలు కాలనీలు జలమయం అయ్యాయి. టీఆర్ఎస్ హయాంలో నాళాలు.. చెరువులు కబ్జాలకు గురవడంతోనే వరంగల్ నగరం మునిగిందనే విమర్శలు వచ్చారు. దీంతో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఆగమేఘాల మీద వరంగల్ నగరాన్ని సందర్శించారు.

    కేటీఆర్ వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత అధికారులు ఆ విషయాన్ని గాలికొదిలేశారు. మొక్కుబడిగా ఒకటి రెండుచోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇక తాజాగా హైదరాబాద్ నగరం వరదల్లో మునిగిపోవడం టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యానికి నిదర్శనంగా కన్పిస్తుంది. చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లోని పలుకాలనీలు జలమయం అయ్యారు.

    ఈ వరదల్లో పలువురు నగరవాసులు కొట్టుకుపోయారు. దీంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం వరద తగ్గిన కాలనీలన్నీ బురదమయంగా మారి దుర్వాసన వెదజల్లుతుండటంతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో నగరవాసులు కష్టాలపై ములుగు ఎమ్మెల్యే ధనుసరి సీతక్క సీఎం కేసీఆర్ కు ట్వీటర్లో ఓ రిక్వెస్ట్ చేసింది. ఆమె చేసిన ట్వీట్ సీఎం కేసీఆర్ కు కనువిప్పు కలిగించేలా ఉండటంతో నెటిజన్లు దీనిని వైరల్ చేస్తున్నారు.

    సీఎం కేసీఆర్ తరచూ ప్రగతి భవన్ టు గజ్వేల్‌ ఫామ్ హౌస్ కు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వరద కారణంగా జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలోనూ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్- ఫామ్ హౌస్ కు రాకపోకలు సాగిస్తుండటంపై సీతక్క ట్వీటర్లో సీఎం ఒక రిక్వెస్ట్ చేసింది.

    Also Read: అజ్ఞాతవాసి.. మన చంద్రబాబు!

    ‘అయ్యా ముఖ్యమంత్రి గారు.. దయచేసి మీ 300ఎకరాల ఫామ్ హౌస్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీసుకు రాకపోకలు సాగించకండి.. మీ ప్రయాణాల వల్ల ఈ భారీ వర్షాల్లో 60కిమీ. మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది.. పాపం వాళ్లు కూడా జాగ్రత్తగా ఇళ్లకు చేరాలి కదా.. ఓ సారి ఆలోచించండి’ అంటూ ట్వీట్ చేసింది.

    ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన ముఖ్యమంత్రే ప్రజలను ఇబ్బందులు పెట్టడం భావ్యంకాదని సీతక్క సూచించింది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఎవరీ మాటలను లెక్కచేయని సీఎం కేసీఆర్.. సీతక్క సూచనలను మాత్రం పట్టించుకుంటారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏదిఏమైనా సీఎం కేసీఆర్ దృష్టికి నగరవాసుల సమస్యను తీసుకెళ్లడంలో సీతక్క చూపిన తెగువను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

    https://twitter.com/seethakkaMLA/status/1317659956414271489?s=20