MLA Seethakka: రాష్ట్రపతి ఎన్నికల్లో ఓ వింత పరిణామం చోటుచేసుకుంది. పొరపాటున ఓ ఎమ్మెల్యే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ బలపరచిన వ్యక్తికి కాకుండా అధికార పార్టీ నియమించిన వ్యక్తికి ఓటు వేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ అసెంబ్లీలో రాష్ర్టపతి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎమ్మెల్యేలు రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ మహిళా ఎమ్మెల్యే అనుకోకుండా ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసిన సంఘటన వెలుగులోకి రావడం గమనార్హం. ఎమ్మెల్యే అంటే సాధారణ వ్యక్తి కాదు కాస్తో కూస్తో చదువుకున్న వారే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వస్తున్నారు. అంత మాత్రాన అనుకోకుండా అని చెబుతున్నా అందులో ఏదో విషయం దాగి ఉందనే వాదన కూడా వస్తోంది.

ఎన్డీఏ పక్షాన ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. దీంతో సోమవారం జరిగిన ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు వేశారు. బీజేపీ దాని మిత్ర పక్షాలు ద్రౌపది ముర్ముకు, విపక్షాలు యశ్వంత్ సిన్హాకు ఓటు వేయడం జరిగింది. అయితే ఇందులో ములుగు ఎమ్మెల్యే సీతక్క మాత్రం తన ఓటును ద్రౌపది ముర్ముకు వేసినట్లు తెలుస్తోంది. ఇదేదో అనుకోకుండా జరిగిందని చెబుతూ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తాము ఏమి చేయలేమని వారు సమాధానం ఇచ్చారు.
Also Read: Pawan Kalyan: పవన్ దూకుడు.. డిఫెన్స్‌లో జగన్ సర్కార్
దీంతో సీతక్క విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే ద్రౌపది ముర్ము గిరిజన మహిళ, సీతక్క గిరిజన మహిళ కావడంతో కావాలనే ఓటు వేసిందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చదువురాని వారే స్పష్టంగా ఓటు వేస్తున్న నేపథ్యంలో సీతక్క ద్రౌపది ముర్ముకు ఓటు వేయడం వివాదాస్పదంగా మారింది. యశ్వంత్ సిన్హాకే ఓటు వేయాలని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినా క్రాస్ ఓటు వేయడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీతక్క ఓటు తప్పిపోవడంపై పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు.

సీతక్క ఓటు విషయంలో పార్టీలో చర్చలు నడుస్తున్నాయి. కావాలనే ద్రౌపది ముర్ముకు ఓటు వేసిందా? లేకపోతే యాదృచ్చికంగా జరిగిందా అని నేతలు ఆలోచనలో పడ్డారు. ఏదిఏమైనా బీజేపీకి సీతక్క రూపంలో లాభమే జరిగినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం దీనిపై ఏం చర్యలు తీసుకుంటుందో? పొరపాటుగా జరిగిందని వదిలేస్తారో అంతుచిక్కడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగియడంతో ఇక అభ్యర్థుల బలాబలాలు తేలాల్సి ఉంది. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో అని ఆలోచిస్తున్నా అధికార పార్టీ బీజేపీకే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నట్లు సమాచారం.
[…] Also Read: MLA Seethakka: రాష్ట్రపతి ఎన్నికలు : కాంగ్రెస్… […]