Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ఇటీవల రాజకీయ దూకుడు పెంచారు. ప్రజల సమస్యలను ఎంజెండాగా పోరాటం చేస్తున్నారు. నిత్యం జనంలో ఉండేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. తద్వారా పార్టీలో స్తబ్ధుగా ఉన్న క్యాడర్‌లో జోష్ పెంచుతున్నారు. మరోవైపు పవన్ దూకుడుతో ఆంధ్రప్రదేశ్‌లోని జనగర్ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడుతోంది.

కౌలు రైతులకు అండగా పవన్..
ఆంధ్రప్రదేశలో కౌలు రైతలు ఎక్కువ. పంట నష్టం, అధిక వర్షాలతో గతేడాది చాలా మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కౌలు రైతు కుటుంబాలను పరామర్శిస్తున్నారు. పార్టీ తరఫున ఆర్థికసాయం చేస్తున్నారు. పనిలో పనిగా జగన్ సర్కార్‌ను ఎండగడుతున్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలమైందని విమర్శిస్తున్నారు.
వివరణ ఇచ్చుకుంటున్న ఏపీ సర్కార్..
ఇన్నాళ్లూ పవన్‌ను పెద్దగా పట్టించుకోని జగన్, వైసీపీ మంత్రులు తాజాగా జస సేనాని విమర్శలకు వివరణలు ఇచ్చుకుంటున్నారు. దీంతో వైసీపీలో పవన్ టెన్షన్ మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో పవన్ ఏ విమర్శ చేసినా స్పందిచేవారు కాదు. తాజాగా కౌలురైతుల సమస్యలపై పవన్ చేస్తున్న ఆరపణలతో జగన్ ప్రభుత్వం తన పార్టీ పత్రిక ‘సాక్షి’ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు మంత్రులు, వైసీపీ నేతలు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పవన్ ఆరోపణలు, విమర్శలపై మీడియా ముఖంగా వివరణ ఇస్తున్నారు.

కోన సీమ జిల్లా కౌలు రైతులపై ప్రత్యేక కథనం..
పవన్‌కళ్యాణ్ ఇటీవల కోనసీమ జిల్లాలో పర్యటించారు. 53 కౌలు రైతు కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం కూడా అందించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కౌలు రైతుకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని పచ్చి అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. ఈ క్రమంలలో సాక్షి పత్రికలో పవన్ ఆరోపణలపై ప్రత్యేక కథనమే ఇచ్చారు. నలుగురు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని ప్రస్తావించారు. ఒక్కరికి మాత్రమే పరిహారం అందలేదని తెలిపారు. అయితే 53 మందికి ఇచ్చామని మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. దీంతో పవన్ ఆరోపణల్లో నిజం ముందని ప్రజలు, రైతుల నమ్మే అవకాశం ఉంది.
Also Read:Pawan Kalyan- Jagan: పవన్ దూకుడు.. జగన్‌కు పొలిటికల్ సినిమా
[…] Also Read: Pawan Kalyan: పవన్ దూకుడు.. డిఫెన్స్‌లో జగన్… […]