MLA Roja: చంద్రబాబు ఏడుపు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనది నిజమైన ఏడుపు అని టీడీపీ శ్రేణులు బాధపడుతుండగా.. ఆయనది దొంగ ఏడుపు అని వైసీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు గతంలో అధికారంలో ఉండగా ఏడిపించిన వైనాన్ని బయటకు తీస్తున్నారు.
తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా.. చంద్రబాబు ఏడుపుపై స్పందించారు. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ను ఎంత ఏడిపించావో ఇప్పుడు 71 ఏళ్ల 7 నెలలకు నువ్వు ఏడుస్తున్నావ్ అంటూ ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు.చేసిన వారికి చేసుకున్నంత అంటే ఇదేనని విమర్శించారు.
హైదరాబాద్ అసెంబ్లీలో రోజా బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసిందని పీతల సుజాతతో మీడియా ఎదుట సీడీలు చూపించిన వైనం మరిచిపోయావా? చంద్రబాబు అని ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగిన వైనం సంచలనమైంది. నీకే భార్య ఉందా? ఆమెనే అన్నారా? మాకు భర్త పిల్లలు లేరా? మాకు గౌరవం లేదా? అని రోజా సూటిగా ప్రశ్నించారు.
ప్రధాని మోడీతో సహా అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేశావ్.. సోషల్ మీడియా, మీడియాతో ఎంత దారుణాలు చేశావో అందరికీ తెలుసు అని చంద్రబాబుపై రోజా విమర్శించారు.ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందంటూ.. నువ్వు ఏడిపించిన అందరి గోస తగిలి నువ్వు ఏడ్చేశామని ‘బైబై బాబూ’ అంటూ రోజా సెటైర్ల వర్షం కురిపించారు.