కేంద్రం తీరుపై ఫైర్ అవుతున్న మంత్రి తలసాని

కరోనా ఎఫెక్ట్ తో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తుండంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వలస కూలీల దుస్థితిని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వారిగోడు విన్నవించడంతో సొంత ఊళ్లు వెళ్లేందుకు కేంద్రం అనుమతించింది. అయితే వలస కూలీలను తరలింపు బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం చేతులు దులుపుకోవడంపై పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ కార్మికుల తరలింపు బాధ్యతను […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 5:05 pm
Follow us on


కరోనా ఎఫెక్ట్ తో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తుండంతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వలస కూలీల దుస్థితిని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి వారిగోడు విన్నవించడంతో సొంత ఊళ్లు వెళ్లేందుకు కేంద్రం అనుమతించింది. అయితే వలస కూలీలను తరలింపు బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్రం చేతులు దులుపుకోవడంపై పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ కార్మికుల తరలింపు బాధ్యతను కేవలం రాష్ట్రాలపై నెట్టడంం సమంజసంగా లేదని విమర్శించారు. విదేశాల్లో ఉన్న వారిని విమానాల్లో తీసుకుచ్చేందుకు మొగ్గుచూపుతున్న ప్రభుత్వం రాష్ట్రాల్లోని వలస కార్మికుల గురించి ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. కేంద్రం వెంటనే వలస కార్మికుల కోసం ఉచితంగా ప్రత్యేక రైళ్లు నడపాలని ఆయన డిమాండ్ చేశారు.

మత సామరస్యం సాధ్యమేనా?

తెలంగాణలో బీహార్, ఝార్ఖండ్, ఛతీస్ గడ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 15లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని తెలిపారు. వీరందరినీ తమ సొంత రాష్ట్రాలకు బస్సుల్లో తరలించాలంటే మూడు నుంచి ఐదురోజుల సమయం పడుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలా చేయడం వల్ల మరికొన్ని సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. వలస కార్మికులు రైళ్లలో సొంత రాష్ట్రాలకు చేరుకున్నాక ఆయా రాష్ట్రాల్లో బస్సుల్లో తరలించేలా కేంద్రం చర్యలు తీసుకునేలా చర్యలు కోరారు. కేంద్రం కేవలం సడలింపులిచ్చి చేతులు దులుపుకోకుండా ఆయా రాష్ట్రాలకు వలస కూలీలను తరలించే ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.