RGV-Perni Nani: సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మొదట్లో పవన్ కల్యాణ్ సినిమా టికెట్ల రేట్ల విషయంలో విమర్శలు చేసినా ఎవరు పట్టించుకోలేదు. దీంతో రాజకీయ దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో ఏపీలో థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వంపై ఆగ్రహం కూడా పెరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం దిగి రాలేదు. ఈ క్రమంలో మంత్రి పేర్ని నాని, దర్శకుడు రాంగోపాల్ వర్మ మధ్య అమరావతి సచివాలయంలో జరిగిన చర్చతో అందరి దృష్టి దానిపైనే పడింది.
సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో టాలీవుడ్ ఎన్నో వ్యయప్రయాసలు పడింది. దీంతో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో రాంగోపాల్ వర్మ, మంత్రి నాని మధ్య జరిగిన సంభాషణతో సినిమా టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అనుకున్నారు. ధరల నియంత్రణకు వర్మ మార్గం చూపేందుకు సిద్ధమయ్యారు. దీనికి వర్మకు నాని అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో వారిద్దరి మధ్య చర్చలు నేడు సాగుతున్నాయి. నాని వర్మకు మధ్యాహ్నం భోజనంలో మాంసాహారం పెట్టారు. అనంతరం చర్చలు కొనసాగుతున్నాయి.
Also Read: ఆ మినిస్టర్ ఎవరో తెలియదంటున్న ఆర్జీవి… పంచ్ మామూలుగా లేదంటున్న ఫ్యాన్స్ ?
రాంగోపాల్ వర్మ నానితో చర్చలు జరుపుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ దాన్ని కష్టాల పాలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని వర్మ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టికెట్ల ధరల వ్యవహారం ఓ కొలిక్కి వస్తుందని అందరు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏ రకమైన హామీ ఇస్తుందో వేచి చూడాల్సిందే. భేటీ ముగియగానే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఇప్పటికే పలు విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. దీంతో సినిమా పరిశ్రమ కష్టాలు ఎదుర్కొంది. ఎంత మంది కల్పించుకున్నా ప్రభుత్వం దిగి రాలేదు. ఫలితంగా సమస్యలు చుట్టుముట్టినా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. దీంతో ఇప్పుడు రాంగోపాల్ వర్మ, మంత్రి నాని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: ఆర్జీవీతో పేర్ని నాని భేటీ.. చిరు, నాగ్ కి దొరికిన అపాయింట్ మెంట్ ఆర్జీవీ కెలా ?