మజ్లిస్‌ బెట్టు..: తెరపైకి రొటేషన్‌ పద్ధతి

జీహెచ్‌ఎంసీ మేయర్‌‌, డిప్యూటీ మేయర్‌‌ ఎవరనేది ఈ రోజు తేలబోతోంది. సీల్డ్‌ కవర్‌‌లో క్యాండిడేట్ల పేర్లు ఇచ్చిన అధికార పార్టీ.. ఎన్నిక సందర్భంగా కేటీఆర్‌‌ సమక్షంలో వాటిని ఓపెన్‌ చేయబోతున్నారు. అయితే.. మేయర్‌‌ ఎన్నిక సందర్భంగా ఏఐఎంఐఎం అనూహ్య ఎత్తుగడనే తెరపైకి తెస్తోంది. రొటేషన్ పద్ధతిని అమల్లోకి తీసుకరావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మేయర్ పీఠాన్ని చెరి రెండున్నరేళ్ల కాలంపాటు పంచుకోవాలనే ప్రతిపాదననే మళ్లీ పెడుతోందట. Also Read: విశాఖలో న్యూ ఎంట్రీ..: ఇప్పటికే పోస్కో కంపెనీతో ఒప్పందం […]

Written By: Srinivas, Updated On : February 11, 2021 12:40 pm
Follow us on


జీహెచ్‌ఎంసీ మేయర్‌‌, డిప్యూటీ మేయర్‌‌ ఎవరనేది ఈ రోజు తేలబోతోంది. సీల్డ్‌ కవర్‌‌లో క్యాండిడేట్ల పేర్లు ఇచ్చిన అధికార పార్టీ.. ఎన్నిక సందర్భంగా కేటీఆర్‌‌ సమక్షంలో వాటిని ఓపెన్‌ చేయబోతున్నారు. అయితే.. మేయర్‌‌ ఎన్నిక సందర్భంగా ఏఐఎంఐఎం అనూహ్య ఎత్తుగడనే తెరపైకి తెస్తోంది. రొటేషన్ పద్ధతిని అమల్లోకి తీసుకరావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మేయర్ పీఠాన్ని చెరి రెండున్నరేళ్ల కాలంపాటు పంచుకోవాలనే ప్రతిపాదననే మళ్లీ పెడుతోందట.

Also Read: విశాఖలో న్యూ ఎంట్రీ..: ఇప్పటికే పోస్కో కంపెనీతో ఒప్పందం

నిజానికి-ఎక్స్అఫీషియో సభ్యుల బలంతో అధికార పార్టీకి మేయర్‌‌ స్థానం రావడం గ్యారంటీ. కానీ.. పోయిన ఐదేళ్లు పూర్తిస్థాయిలో టీఆర్‌‌ఎస్‌ అధికారాన్ని అనుభవించింది. దీంతో ఈ సారి తమకు కూడా అవకాశం కల్పించాలనే డిమాండ్‌ను తెరపైకి తెస్తోంది. మేయర్ పదవి ఎన్నికల్లో మజ్లిస్.. టీఆర్ఎస్‌ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎలాంటి పొత్తులు, సీట్ల సర్దుబాటు లేకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ పోటీ చేశాయి. ఇదివరకు మజ్లిస్–-కాంగ్రెస్ రొటేషన్ పద్ధతిలో మేయర్ పదవీ కాలాన్ని పంచుకున్నాయి. అదే పద్ధతిని అనుసరించాలనే ప్రతిపాదనను మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. టీఆర్ఎస్ నేతల ముందుంచారని అంటున్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదని సమాచారం.

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో మజ్లిస్ కార్పొరేటర్లు దారుస్సలాంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీట్‌ అయ్యారు. మజ్లిస్ గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు. 44 మంది కార్పొరేటర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. మేయర్ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 150 మంది సభ్యుల బలం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మజ్లిస్‌ 44 డివిజన్లను గెలుచుకుంది. వారంతా కూడా ఈ సమావేశానికి అటెండ్‌ అయ్యారు. మేయర్‌ను ఎలా ఎన్నుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు.

Also Read: తిరుపతి సీటు బీజేపీకా.? జనసేనకా? ‘పంచాయతీ’ తేల్చేసింది..

ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలను సాధించిన నేపథ్యంలో.. ఆ పార్టీ దూకుడును అడ్డుకోవడానికి టీఆర్ఎస్‌కు తమ పార్టీ కార్పొరేటర్ల సహాయ, సహకారాలు అవసరం అవుతాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక డిమాండ్లను టీఆర్ఎస్ ముందు పెట్టడానికి ఇదే సరైన సమయమని మజ్లిస్ నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై దారుస్సలాం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ.. విప్‌ను జారీ చేయగా.. మజ్లిస్ ఆ పని చేయలేదు. విప్‌ను జారీ చేయకపోవడం ఆసక్తి రేపుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్