Megastar meets Jagan: ఏపీలో థియేటర్లు, టికెట్ రేట్ల వ్యవహారం పై జరుగుతున్న దుమారం పై తాజాగా జగన్ తో మెగాస్టార్ భేటీ కాబోతున్నారు. సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలవనున్నారు చిరంజీవి. సినిమా టికెట్ల విషయంపై సీఎం తో చర్చించి.. టికెట్ల వ్యవహారానికి ముగింపు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి చిరంజీవి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత సీఎం జగన్ ను చిరంజీవి కలవనున్నారు.

జగన్ తో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ అవుతుండటం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత కొంత కాలంగా చిత్ర పరిశ్రమలో ఏపీలో ఎదుర్కొంటున్న సమస్యలపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరగనుంది. సినిమా వాళ్ళ పై వైసీపీ నాయకులు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలని కూడా చిరు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది. మరి చిరుతో భేటీ తర్వాత వైఎస్ జగన్ ఎలాంటి ప్రకటన చేస్తాడో ? చూడాలి.
Also Read:కనిపించని శత్రువులే చంద్రబాబుకు ప్రమాదమట?
మరోపక్క వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, టికెట్ రేట్ల సమస్య పై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో భేటీ అయినా ఎలాంటి ఉపయోగం లేదు. ఇంతకీ చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగడం వెనుక సీఎం వైఎస్ జగన్ ఉన్నాడా ? లేక, జగన్ తో భేటీకి చిరంజీవి చొరవ తీసుకున్నాడా ? చూడాలి.
ఈ మధ్యలో టాలీవుడ్ కు చెందిన కొందరు మాత్రం ఏపీ ప్రభుత్వంను సమర్థిస్తూ జగన్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అందుకే, టికెట్ల రేట్ల విషయంలో సినిమా జననానికి ఏమైనా మేలు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నాడా ? చూడాలి.
Also Read: పిల్లలపై ప్రేమ పెంచుకుంటున్న రుద్రాణి.. భయంతో వణికిపోతున్న కార్తీక్!