https://oktelugu.com/

China Corona Crisis : స్మశానాల వద్ద శవాల క్యూలు.. చైనాలో కరోనా దారుణాలపై షాకింగ్ వీడియో.. వైరల్

China Corona Crisis : కరోనా ప్రపంచానికి అంటించి చోద్యం చూసిన చైనా ఇప్పుడు అనుభవిస్తోంది. లక్షల మంది చావులకు కారణమై కంట్రోల్ చేశామని విర్రవీగిన చైనాలో ఇప్పుడు కరోనా కట్టుతప్పింది. వీరవిహారం చేస్తోంది. వికటట్టహాసం చేస్తూ చైనీయుల ప్రాణాలు బలిగొంటోంది. చైనాలో జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేసిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. గడిచిన 20 రోజుల్లోనే చైనాలో 25 కోట్ల మందికి వైరస్ సోకిందని తాజాగా ఓ రిపోర్టు బయటకు వచ్చింది. అంటే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2022 8:10 pm
    Follow us on

    China Corona Crisis : కరోనా ప్రపంచానికి అంటించి చోద్యం చూసిన చైనా ఇప్పుడు అనుభవిస్తోంది. లక్షల మంది చావులకు కారణమై కంట్రోల్ చేశామని విర్రవీగిన చైనాలో ఇప్పుడు కరోనా కట్టుతప్పింది. వీరవిహారం చేస్తోంది. వికటట్టహాసం చేస్తూ చైనీయుల ప్రాణాలు బలిగొంటోంది.

    చైనాలో జీరో కోవిడ్ పాలసీ ఎత్తివేసిన తర్వాత కరోనా పాజిటివ్ కేసులు దారుణంగా పెరుగుతున్నాయి. గడిచిన 20 రోజుల్లోనే చైనాలో 25 కోట్ల మందికి వైరస్ సోకిందని తాజాగా ఓ రిపోర్టు బయటకు వచ్చింది. అంటే చైనా జనాభాలో దాదాపు 18 శాతం మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. ఆసుపత్రులు రోగులతో కిట కిట లాడుతున్నాయి. ఇదే కొనసాగితే డిసెంబర్ చివరి వారంలో ఒక్కరోజులోనే 3.7 కోట్లకు పైగా కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాప్తిగా పరిణామం చెందే అవకాశం ఉంది.

    దేశంలో కోవిడ్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అత్యవసరంగా భేటీ అయింది.. కోవిడ్ వ్యాప్తిని ఎలా అరికట్టాలనే అంశంపై తీవ్రంగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.. మరోవైపు కోవిడ్ ను కట్టడి చేసేందుకు అవలంబించిన జీరో కోవిడ్ పాలసీ వల్ల హార్డ్ ఇమ్యూనిటీ తగ్గి… ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వ్యాప్తి చెందేందుకు దారి తీసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. తాజా వ్యాప్తిలో చిచువాన్ ప్రావిన్స్ లోని సౌత్ వెస్ట్, బీజింగ్ లో సగానికి పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అంచనా వేస్తోంది. అయితే చైనా హెల్త్ రెగ్యులేటరీ ఈ అంచనాలకు ఎలా వచ్చిందని అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు.

    కోవిడ్ తీవ్రతకు అద్దం పట్టేలా తాజాగా చైనాలోని ఓ స్మశానం వద్ద భయంకరమైన వీడియో ఒకటి బయటకు వచ్చింది. చైనా ఆరోగ్య నిపుణుడు ఎరిక్ ఫైగిల్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. చనిపోయిన కరోనా మృతదేహాల అంత్యక్రియల కోసం స్మశానాల ముందు భారీగా క్యూలైన్లు కనిపించాయి. ఇంతటి దారుణమైన పరిస్థితులు చైనాలో ఉన్నాయని ఆ వీడియోలు చూస్తే అర్థమవుతోంది. అందుకే చైనా కోవిడ్ లెక్కలు బయటపడకుండా ఉక్కుపాదం మోపుతోంది. కానీ సోషల్ మీడియాలో చైనాలో కరోనా కల్లోలం.. స్మశానల వద్ద శవాల గుట్టలు, ఆస్పత్రుల్లో రోగుల తాకిడి వీడియోలు అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో కళ్లకు కడుతున్నాయి.