https://oktelugu.com/

National Anthem: తెలంగాణలో రేపు నిమిషం పాటు రెడ్ సిగ్నల్.. అందరూ ఆగిపోవాల్సిందే!

National Anthem: 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాన్ని అంబరాన్నంటేలా దేశం చాటుకుంది. అజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ ఆగస్టు నెల ఆరంభం నుంచే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపనకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం 11.30 గంటలకు రెడ్ సిగ్నల్ పడిపోతుంది. రహదారులు, స్కూళ్లు, కాలేజీలు, ఇళ్లలో ఉన్న వారంతా లేచి నిలబి సామూహిక జాతీయ గీతాలాపన చేయనున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : August 15, 2022 / 09:47 PM IST
    Follow us on

    National Anthem: 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాన్ని అంబరాన్నంటేలా దేశం చాటుకుంది. అజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ ఆగస్టు నెల ఆరంభం నుంచే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపనకు అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

    రాష్ట్రవ్యాప్తంగా రేపు ఉదయం 11.30 గంటలకు రెడ్ సిగ్నల్ పడిపోతుంది. రహదారులు, స్కూళ్లు, కాలేజీలు, ఇళ్లలో ఉన్న వారంతా లేచి నిలబి సామూహిక జాతీయ గీతాలాపన చేయనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ అబిడ్స్ కూడలి వద్ద గీతాలాపనలో పాల్గొననున్నారు.

    రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్ లోని అన్ని కూడళ్ల వద్ద 11.30 గంటలకు రెడ్ సిగ్నల్ పడుతుంది. వాహనాలు అన్నీ ఎక్కడికక్కడ ఆపేస్తారు. సామూహిక గీతాలాపన కు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. గీతాలాపన సమయంలో కూడళ్ల వద్ద అన్ని వైపులా రెడ్ సిగ్నళ్లు వేస్తారు. ఆ సమయంలో రోడ్లపై ఒక నిమిషం పాటు అన్ని వాహనాలను ఎక్కడికక్కడ నిలిపి వేస్తారు.

    ఈ జాతీయ గీతాలాపనలో ప్రతీ వాహనదారుడు పాల్గొనేలా ట్రాఫిక్ పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు, పాదచారులు, ప్రజలందరూ పాల్గొనేలా పోలీసులు చొరవ తీసుకుంటారు. వాహనాల రద్దీ నెలకొనకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. సో రేపు హైదరాబాద్ సహా అన్ని నగరాల్లోని కూడళ్లు అన్నీ 11.30కు జాతీయ గీతాలాపన కోసం సిద్ధమవ్వనున్నాయి. వాహనదారులంతా పాల్గొనాలని పోలీస్ కమీషనర్లు పిలుపునిచ్చారు.