Mass Singing of National Anthem: తెలంగాణలో సామూహిక జనగణమన గీతాలాపన విజయవంతమైంది. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య పోరాటానికి తన వంతు తోడ్పాటు అందించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు తెలిపే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గీతాలాపన చేసేందుకు నిశ్చయించింది. దీనికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11.30 గంటలకు అందరు విధిగా సామూహిక గీతాలాపనలో పాల్గొనాలని సూచించింది. సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేసింది. దీనికి ప్రజల నుంచి కూడా మద్దతు లభించింది. స్వాతంత్ర్య సంగ్రామంలో తమకూ భాగం ఉందని భావించి అందరు విధిగా సామూహిక గీతాలాపనలో పాల్గొని తమ వంతు బాధ్యత పోషించారు.

ఆబిడ్స్ జీపీవో సెంటర్ వద్ద సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని సామూహిక గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనాభా మొత్తం ప్రభుత్వ నిర్ణయాన్న ముక్తకంఠంతో పాటించారు. అందరు విధిగా సామూహిక గీతాలాపనలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. దీంతో కార్యక్రమం విజయవంతమైంది. స్వాతంత్ర్య పోరాటానికి అందరు తమ వంతు కర్తవ్యంగా భావించి తమ మద్దతు ప్రకటించడం గర్వకారణం. రాష్ట్రవ్యాప్తంగా ఇంత మంది దేశభక్తులు ఒకే కార్యక్రమానికి జేజేలు కొట్టడం నిజంగా విశేషమే.
Also Read: Rupee Journey: 75 ఏళ్ల స్వాతంత్య్రం.. 75 రూపాయలు పతనం.. రూ.4 నుంచి రూ.80 వరకు రూపాయి ప్రయాణం!
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ర్టవ్యాప్తంగా ఉన్న పట్టణాలు, నగరాలు, గ్రామాలు అంతటా ఒకే సమయంలో సామూహికంగా జనగణమన గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఎక్కడికక్కడే నిలబడి ప్రయాణికులు కూడా గీతాలాపన చేశారు. దీంతో రాష్ట్రం మొత్తం దేశానికి వెన్నెముకగా నిలవడం చూస్తుంటే అందరికి ఎంతో సంతోషంగా కనిపించింది. నగరాల్లో సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆపారు. మెట్రో రైళ్లు కూడా పది నిమిషాలు ఆగి గీతాలాపన తరువాత కదిలాయి. దీంతో ఈ ఘటన అందరిలో దేశభక్తిని నింపింది.

అన్ని జిల్లాల్లోనూ దీనికి విశేష స్పందన లభించింది. దీంతో జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతానికి అందరు సామూహికంగా పాటించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో జాతీయ గీతాలాపన ఎంతో ప్రాచుర్యం పొందిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ గీతాలాపన కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో నిర్వహించి తమ దేశభక్తిని చాటారు. స్వాతంత్ర్య పోరాటానికి తమ వంతు కర్తవ్యంగా సామూహిక గీతాలాపన చేయడం ద్వారా మన పాలకులు ఇచ్చిన సూచనలను అందరు విధిగా పాటించి విజయవంతం చేయడం గమనార్హం.