Wayanad By Election 2024: కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో అనేక పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. రాహుల్ గాంధీ రాజీనామా తో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. రాహుల్ బదులు ఆయన సోదరి ప్రియాంక గాంధీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దాదాపు 16 మంది ఇక్కడ పోటీలో ఉన్నారు. అయితే అందులో 15 మంది స్థానికేతరులు కావడం విశేషం. అయితే అందులో ఇద్దరు తెలుగు వ్యక్తులు ఉండడం కూడా అంతకంటే విశేషం. తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండకు చెందిన దుగ్గిరాల నాగేశ్వరరావు అక్కడ పోటీ చేస్తున్నారు. మరొకరు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ నాగేశ్వరరావు సైతం బరిలో నిలిచారు. హైదరాబాదులో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు జాతీయ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అలాగే ఏపీకి చెందిన షేక్ జలీల్ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగుతున్నారు. ఎం పి స్థానానికి ఈనెల 13న పోలింగ్ జరగనుంది. మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 15 మంది స్థానికేతరులు కాగా.. 11 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడం గమనార్హం.
* తొలిసారిగా ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన ప్రియాంక గాంధీ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.మరొకరు తమిళనాడుకు చెందిన పద్మరాజన్. ఈయనకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ప్రధాన మంత్రులుగా ఉన్న మోదీ, వాజ్పేయి, మన్మోహన్ సింగ్, పీవీ నరసింహారావు తో పాటు ఎంతోమంది రాజకీయ నేతలపై 200కు పైగా ఎన్నికల్లో పోటీ చేశారు పద్మరాజన్.
* 2019 లోక్సభ ఎన్నికల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై పోటీ చేసిన జయేంద్ర కె. రాథోడ్ సైతం బరిలో దిగారు.
* అలాగే యుపి కిసాన్ మజ్దూర్ బెరోజ్గర్ సంఘ్ కు చెందిన గోపాల్ స్వరూప్ గాంధీ, తమిళనాడు బహుజన్ ద్రావిడ పార్టీ నుంచి సీత పోటీలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన నూర్ మహమ్మద్, కర్ణాటక కు చెందిన రుక్మిణి సైతం పోటీలో ఉన్నారు.
* ఉత్తరప్రదేశ్ కు చెందిన సోను సింగ్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సిపిఐ నుంచి సత్యన్ మోకేరి, బిజెపి తరఫున నవ్య హరిదాస్ పోటీలో నిలిచారు. కాగా ఇండిపెండెంట్గా పోటీ చేసిన ఆర్ రాజన్ ఒక్కరే వయానాడ్ నియోజకవర్గానికి చెందినవారు కావడం విశేషం. మిగతా అందరూ స్థానికేతరులే.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Many developments are coming to light in the wayanad lok sabha by elections in kerala
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com