Blackmailing: మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ఇంకా మోసపోతూనే ఉన్నారు. చదువుకున్న వారు కూడా తమ బలహీనతతో ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా చాలిస్తున్నారు. ఎవరో ముక్కు మొహం తెలియని వాడితో చనువుగా ఉండి తమ సర్వస్వాన్ని కోల్పోతున్నారు. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫలితంగా తమ శీలాన్ని కోల్పోతున్నారు. ఎదుటివారి బ్లాక్ మెయిల్ కు లొంగి అన్ని అర్పిస్తున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ర్టంలోని జబల్పూర్ నగరంలోని ఓ త్రీ స్టార్ హోటల్ లో కారు డ్రైవర్ గా పనిచేసే ప్రతాప్ అదే హోటల్ లో పనిచేసే కమలతో చనువుగా ఉండేవాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఈ నేపథ్యంలో ఓ సారి కమలకు ప్రతాప్ ఓ కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన కమల స్ర్పహ కోల్పోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేశాడు. అది వీడియో కూడా తీశాడు. అది చూపించి నాలుగేశ్లుగా అత్యాచారం చేస్తున్నాడు.
గత మార్చిలో కమల చెల్లెలు పుష్ప కూడా జబల్పూర్ కు చదువుకునేందుకు వచ్చింది. దీంతో అప్పుడప్పుడు కమల కోసం హోటల్ కు వచ్చేది. దీంతో ప్రతాప్ కన్ను ఆమెపై పడింది. ఆమెను కూడా లొంగదీసుకోవాలని పథకం వేశాడు. అనుకున్నదే తడవుగా ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అక్కాచెల్లెళ్లను కారులో షికారుకు తీసుకెళ్లాడు.
అక్కడ కూడా కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి పుష్పపై అఘాయిత్యం చేశాడు. దీంతో జరిగిన విషయంపై కమల ప్రతాప్ పై కోపంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టింది. పుష్ప మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద అతడిపై కేసు నమోదు చేశారు. ప్రతాప్ ను అరెస్టు చేయడానికి వెళ్లగా పరారీలో ఉన్నట్లు గుర్తించారు.