Homeజాతీయ వార్తలుStalin Response On Evms: మమత కే కాదు.. జగన్ కూ స్టాలిన్ క్లాస్ పీకాడు.....

Stalin Response On Evms: మమత కే కాదు.. జగన్ కూ స్టాలిన్ క్లాస్ పీకాడు.. ఇక జన్మలో ఆ మాట ఎత్తరు

Stalin Response On Evms: మనదేశంలో రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే.. అధికారాన్ని దక్కించుకుంటేనేమో వారు గొప్ప నాయకులు. ఒకవేళ అధికారాన్ని కోల్పోతే మాత్రం ఈవీఎం లో అవకతవకలు.. గెలిచిన వారేమో తమను తాము గొప్పగా చెప్పుకుంటుంటే.. ఓడిపోయిన వారు తమ తప్పులను కాకుండా.. అదంతా ఈవీఎం ల మాయ అనే విమర్శలు చేస్తున్నారు. ఈవీఎంల ద్వారా గెలిచి.. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని ఆరోపిస్తున్నారు. వారు గెలిసినప్పుడు మాత్రం ఈ మాట మాట్లాడటం లేదు.

ఆ మధ్య ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. వైసిపి దారుణంగా ఓడిపోయింది. 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అయితే ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని అంచనా వేయలేక వైసీపీ దారుణమైన ఓటమిని మూటకటుకుంది. ఈ విషయాన్ని చెప్పలేక వైసీపీ నాయకులు తామ ఓడిపోయిన నెపాన్ని ఈ వియంల నెట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు ఓట్ల నమోదుకు.. చివరి క్షణంలో ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్కకు పోలిక సరిపోడం లేదని సరికొత్త ఆరోపణ తెరపైకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఈవీఎం యంత్రాలను ఎవరూ హ్యాక్ చేయలేరు అనే విషయం అందరికీ తెలుసు కానీ ప్రజల్లో సానుభూతి పొందడానికి ఈ తరహా ప్రచారానికి వైసిపి శ్రీకారం చుట్టడం విశేషం.

వైసిపి మాదిరిగానే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా ఈ తరహా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎన్నికల్లో బిజెపి లూటీ చేసి గెలిచిందని ఆరోపించడం ప్రారంభించారు.. కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూటమి గెలిస్తే దాని గురించి మాట్లాడటం లేదు. అస్సాం, పశ్చిమబెంగాల్ లో బిజెపి గెలిస్తే మాత్రం మమత బెనర్జీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. చివకి తమిళనాడులో ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాకపోయిన విషయాన్ని కూడా ఆమె గుర్తించడం లేదు. చివరికి తమిళనాడులో బిజెపి ఒకే ఒక ఎమ్మెల్యే స్థానంతో సరిపెట్టుకున్నప్పటికీ ఆమెకు అది కనిపించడం లేదు. పైగా రాహుల్ గాంధీ లాంటి నాయకులు మమతను సపోర్ట్ చేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ లాంటి మాజీ ముఖ్యమంత్రి మమతకు జై కొడుతున్నారు. అసలు ఇటువంటి నాయకులను ఏమనాలో అర్థం కావడం లేదు.

మరోవైపు ఇండియా కూటమిలోనే ఉన్న డీఎంకే మాత్రం తమిళనాడు ఎన్నికల విషయంలో సరికొత్తగా స్పందించింది.. ముఖ్యంగా డీఎంకే అధినేత స్టాలిన్ హుందాగా మాట్లాడారు.. ఆయన మాట్లాడిన మాటలు చాలామంది నాయకులకు గడ్డి పెట్టే విధంగా ఉన్నాయి.. “నేను గెలిచింది ఈవీఎంల మీదనే.. ఓడిపోయింది కూడా ఈవీఎంల మీదనే.. గెలిచాక నా సత్తా వల్లా అని.. ఓడిపోయిన తర్వాత ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని అదంతా దద్దమ్మని కాదు. ప్రజల తీర్పు గౌరవించడం రానివాళ్లే అలా మాట్లాడతారు” అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను టిడిపి నేతలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. ఈవీఎంల మీద మాట్లాడే నాయకులకు స్టాలిన్ గడ్డపార స్థాయిలో రాడ్డు దింపారని వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version