చెంచాగిరి చేయాల్సిన అవసరం లేదంటున్న కాంగ్రెస్ నేత..!

కొత్త ఏడాదిలో కొత్త టీపీసీసీని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే ఈ పదవీని ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉండటంతో నేతల మధ్య పోటీ నెలకొంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం గతంలోనూ ఎన్నడూ లేనివిధంగా టీపీసీసీపై అభిప్రాయ సేకరణ చేపట్టింది. Also Read: వీహెచ్ వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్? కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ రెండ్రోజులు హైదరాబాద్లోనే మకాంవేసి ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించారు. దీనిని కాంగ్రెస్ అధిష్టానానికి నివేదించారు. మెజార్టీ […]

Written By: Neelambaram, Updated On : December 26, 2020 8:02 pm
Follow us on


కొత్త ఏడాదిలో కొత్త టీపీసీసీని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే ఈ పదవీని ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉండటంతో నేతల మధ్య పోటీ నెలకొంది. దీంతో కాంగ్రెస్ అధిష్టానం గతంలోనూ ఎన్నడూ లేనివిధంగా టీపీసీసీపై అభిప్రాయ సేకరణ చేపట్టింది.

Also Read: వీహెచ్ వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్?

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ రెండ్రోజులు హైదరాబాద్లోనే మకాంవేసి ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించారు. దీనిని కాంగ్రెస్ అధిష్టానానికి నివేదించారు. మెజార్టీ నేతలు రేవంత్ కే అనుకూలంగా అభిప్రాయం వెల్లడించారనే ప్రచారం కాంగ్రెస్ లో జరుగుతోంది.

కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ వైపు మొగ్గుచూపుతుందని తెలుసుకున్న పలువురు సీనియర్ నేతలు అధిష్టానంపై ధిక్కారస్వరం విన్పిస్తున్నారు. తాజాగా వీహెచ్ హన్మంతరావు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ అభిప్రాయ సేకరణ సరిగా చేయలేదని.. ఆయన అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

Also Read: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.?

వీహెచ్ వ్యాఖ్యలను మరో కాంగ్రెస్ నేత మల్లు రవి ఖండించారు. వైద్య విద్యలో ఉన్నత చదువులు చదివి సమాజంలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని.. తనకు ఎవరికీ చెంచాగిరి చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ ప్రాంతానికి చెందిన రేవంత్‌రెడ్డికి పీసీసీ ఇవ్వాలని బహిరంగంగానే తాను చెప్పినట్లు మల్లు రవి చెప్పారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్నిస్థాయి నేతలతో మాణిక్యం ఠాగూర్ చర్చలు జరిపారని మల్లు రవి గుర్తు చేశారు. గతంలో సీఎం.. సీఎల్పీ.. పీసీసీ నియామకాల్లో అందరూ హైకమాండ్ నిర్ణయాలకు కట్టుబడి పని చేశారని తెలిపారు. క్షమశిక్షణ కలిగిన నేతలైతే అధిష్టానం నిర్ణయానికి కట్టబడి ఉండాలని మల్లు రవి స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్