
కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి 22 ఆదివారం జనతా కర్ఫ్యూ విధించాలని ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మోడీ నిర్ణయాన్ని స్వాగతించారు. జనతా కర్ఫ్యూకు మద్దతు ఇవ్వమని ప్రజలను కోరడంలో ఆయన పవన్ కళ్యాణ్ ను అనుసరించారు.
సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో “మమ్మల్ని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెడుతున్న మన ధైర్య హృదయాలకు కూడా వందనం చేద్దాం మరియు ఈ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మా బాల్కనీలలో నిలబడి నావంతు సహకారం ఇస్తానని, వారి నిర్ణయాన్ని మనం ఎంతగానో అభినందించాలంటూ మహేష్ ట్వీట్ చేశారు.