మధ్యప్రదేశ్‌లో నిమిషానిమిషానికి రాజకీయం మారుతోంది. మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. 18 ఏళ్లుగా కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్న తాను ప్రస్తుతం పార్టీని వీడాల్సిన సమయం వచ్చిందని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ట్వీటర్లో పంపారు. ఆ తర్వాత నేరుగా ఆయన ప్రధాని నివాసానికి వెళ్లడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూల్చేందుకు మోడీ-అమిషాలు జ్యోతిరాదిత్యతో చర్చించినట్లు తెలుస్తోంది. జ్యోతిరాదిత్య వెంట కొంతమంది ఎమ్మెల్యేలు నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. 16 మంది ఎమ్మెల్యేలతో ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. కొద్ది సేపటి క్రితమే ఆయన ప్రధాని మోదీ నివాసానికి వెళ్లడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేయడానికి ముందే సోనియాగాంధీ ఆదేశంతో కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సింథియాను రాజ్యసభకు పంపుతామని బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిమధ్య చర్చలు విఫలమైనట్లు సమాచారం.
దీంతో కాంగ్రెస్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని జ్యోతిరాదిత్య సింగ్ ను కాంగ్రెస్ అధిష్టానం బహిష్కరించింది. అయితే అంతకముందే జ్యోతిరాదిత్య సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం అమిషాతో కలిసి మోడీ నివాసానికి వెళ్లారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకాలేదని చెబుతుంది.
జ్యోతి ఆదిత్యా కాంగ్రెస్ పార్టీకి హ్యండ్ ఇవ్వడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. 16మంది ఎమ్మెల్యేలు సింథియా వెంట నడుస్తుండటంతో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడనుంది. తాజా పరిణామాలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుండగా కాంగ్రెస్ పార్టీలో భయాందోళన కలిగిస్తోంది. ఈ సంక్షోభాన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి మరీ.