Homeఆంధ్రప్రదేశ్‌Vijayawada: ప్రేమ పేరుతో ప్రియురాలి నగ్న వీడియోలు.. షాకింగ్ నిజాలు

Vijayawada: ప్రేమ పేరుతో ప్రియురాలి నగ్న వీడియోలు.. షాకింగ్ నిజాలు

Lover posts girl obscene videosVijayawada: స్నేహం పేరుతో వల వేశాడు. తరువాత ప్రేమ(Love) అని నమ్మించాడు. యువతి జీవితాన్ని అల్లకల్లోలం చేశాడు. నమ్మినందుకు ఆమె జీవితంలో అలజడి సృష్టించాడు. సామాజిక మాధ్యమాన్ని వేదికగా చేసుకుని ఆమె నగ్న వీడియోలు పోస్టు చేసి తనలోని రాక్షసత్వాన్ని నిరూపించుకున్నాడు. స్నేహితుడని నమ్మినందుకు నట్టేట ముంచాడు. ఆమె పరువును నడిబజారులో అమ్మకానికి పెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

బీహార్ కు చెందిన రోహిత్ కుమార్ మూడేళ్ల క్రితం విజయవాడలోని ఓ ప్రముఖ డిగ్రీ కళాశాలలో చదివేవాడు. దీంతో ఇదే కాలేజీలో చదువుతున్న ఓ యువతిని స్నేహం పేరుతో దగ్గరయ్యాడు. ఇదే అదనుగా భావించి ప్రేమ పేరుతో నటించాడు. నిజమని నమ్మిన ఆమె అతడి ప్రేమను అంగీకరించింది. ఈ క్రమంలో ఆమె నగ్న వీడియోలు, ఫొటోలు పంపేందుకు సమ్మతించింది. కానీ కొంత కాలానికి ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో విడిపోయారు. కానీ అతడిలో మానవ మృగం నిద్రలేచింది. ఎలాగైనా ఆ యువతిని చులకన చేయాలని భావించి తన స్నేహితుడి సహకారంతో ఆమె నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయించాడు. దీంతో ఆమె నిర్ఘాంతపోయి విజయవాడ పోలీసులను ఆశ్రయించింది.

దీంతో అతడి స్నేహితుడు గణేష్ ఇన్‌స్టాగ్రామ్ లో ఫేక్ ఖాతా సృష్టించారు. అందులో ఆమె వీడియోలు పంపించారు. విషయం తెలుసుకున్న యువతి ఆందోళనకు గురైంది. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాంకేతికతతో ఏ సెల్ ఫోన్ లో నకిలీ ఖాతా సృష్టించారో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చివరకు గుర్తించారు. కృష్ణలంకకు చెందిన గణేష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అపరిచితుల మధ్య అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా యువతుల్లో చైతన్యం రావడం లేదు. ఎవరో వ్యక్తిని నమ్మి తన నగ్న చిత్రాలు పంపించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఎదుటి వారిని తక్కువ అంచనావేయడం తగదు. యువతులు ఇలా మోసాలకు గురవడం బాధాకరమే. ఎప్పుడైనా ఎవరిని కూడా నమ్మకుండా తమ జాగ్రత్తలో తాముండాలని సూచిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version