https://oktelugu.com/

దూసుకెళ్తున్న ‘బండి’.. వీర్రాజుకు సవాల్

పోలిక.. కొందరికి ఉత్సాహాన్ని ఇస్తే, మరికొందరిని ఒత్తిడిలోకి నెడుతుంది. వ్యక్తిగత జీవితాల్లో ఈ పోలిక సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం ఇబ్బందికర పరిస్థితినే తెచ్చి పెడుతుంది. ఇప్పుడు ఇదే పరిస్థిత్ని ఎదుర్కొంటున్నారు.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ పోలిక, తద్వార నెలకొన్న పోటీలో నెగ్గకపోతే, ఏకంగా తన నాయకత్వం పైనే నెగెటివ్ ముద్ర పడుతుందన్న ఆందోళనలో వీర్రాజు ఉన్నారు. Also Read: కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్పులకు కేంద్రం సుముఖం? “బండి” వేగం… […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 / 05:53 PM IST
    Follow us on


    పోలిక.. కొందరికి ఉత్సాహాన్ని ఇస్తే, మరికొందరిని ఒత్తిడిలోకి నెడుతుంది. వ్యక్తిగత జీవితాల్లో ఈ పోలిక సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం ఇబ్బందికర పరిస్థితినే తెచ్చి పెడుతుంది. ఇప్పుడు ఇదే పరిస్థిత్ని ఎదుర్కొంటున్నారు.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ పోలిక, తద్వార నెలకొన్న పోటీలో నెగ్గకపోతే, ఏకంగా తన నాయకత్వం పైనే నెగెటివ్ ముద్ర పడుతుందన్న ఆందోళనలో వీర్రాజు ఉన్నారు.

    Also Read: కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్పులకు కేంద్రం సుముఖం?

    “బండి” వేగం…
    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొద్దికాలం క్రితం కొత్త అధ్యక్షులను బీజేపీ అధిష్టానం నియమించింది. తెలంగాణకు బండి సంజయ్, ఏపీకి సోము వీర్రాజు నియమితులయ్యారు. అయితే.. ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నేతలు కావడంతో కొంత దూకుడుగానే ఉన్నారు. అధికార పార్టీని ఇద్దరూ ధీటుగానే ఎదుర్కొంటున్నారు. కానీ.. వీరిద్దరిలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విజయ పథంలో దూసుకెళ్తున్నారు.

    వరుస విజయాలు...
    తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంతో బండి సంజయ్ గ్రాఫ్ అధిష్టానం వద్ద బాగా పెరిగింది. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేయడమే ఇందుకు నిదర్శనం. దుబ్బాకలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి టీఆర్ఎస్ ను మట్టికరిపించిన తర్వాత.. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ ఊహించనటువంటి స్థాయిలో డివిజన్లను గెలుచుకుంది. దీంతో.. ఇప్పుడు ఏపీలోని కాషాయ శ్రేణుల దృష్టి సోము వీర్రాజుపై పడింది. త్వరలో తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికలో బీజేపీని సోము వీర్రాజు గెలిపిస్తారా? లేదా? అనే చర్చ మొదలైంది.

    Also Read: ఏపీ మహిళా అధికారిణుల మధ్య కొత్త వివాదం..!

    అంత ఈజీ కాదు…
    అయితే.. తిరుపతి పార్లమెంటు ఎన్నిక, దుబ్బాక ఎన్నికంత సులువు కాదు. ఇక్కడ బీజేపీ బలహీనంగా ఉంది. అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యాలు లేవు. ఇప్పటికే టీడీపీ, వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ, జనసేనలో ఎవరు పోటీ చేయాలన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవకపోయినా రెండోస్థానంలో నిలవాలన్నది సోము వీర్రాజు ప్రయత్నంగా కన్పిస్తోంది. అది సాధించినా సోము వీర్రాజు సక్సెస్ అయినట్లే. మరి టీడీపీని వెనక్క నెట్టి సోము వీర్రాజు పార్టీని ఆ దిశగా తీసుకు వెళ్లగలరా? అన్నదే ప్రశ్న.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్