Lok Sabha Election Results 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో తీవ్రంగా నష్టపోయిన బీజేపీ అధికారంలో లేని ఒడిశా, ఢిల్లీ, బిహార్‌లో సత్తా చాటుతోంది. ట్రెండ్స్ చూస్తుంటే బిహార్‌లో ఎన్డీఏ కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. ఢిల్లీ, మధ్య ప్రదేశ్‌లో బీజేపీ ఒంటరిగా క్లీన్‌స్వీప్ చేస్తోంది.
బిహార్‌లో 40 సీట్లు..
బిహార్‌లో 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ జేడీయూ 25 స్థానాల్లో, బీజేపీ 15 స్థానాల్లో పోటీ చేశారు. అన్ని స్థానాల్లో ఎన్‌డీఏ ఆధిపత్యం కనబరుస్తోంది.
ఢిల్లీలో..
ఇక ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది. ఇక్కడ ఏడు లోక్‌సభ స్థానాలు ఉండగా ఆరింటిలో ఆప్, ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేశాయి. అన్ని స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. లిక్కర్ స్కామ్ ప్రభావం ఇక్కడి ఎన్నికలపై స్పష్టంగా పడింది.
మధ్యప్రదేశ్‌లో..
ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లోనే బీజేపీ తన పట్టు నిలుపుకుంది. యూపీ, రాజస్థాన్‌లో బీజేపీ పట్టు సడలింది. మధ్యప్రదేశ్‌లో మాత్రం 25 స్థానాలకు 25 గెలిచేలా ట్రెండ్స్ వస్తున్నాయి.