
తెలంగాణలో రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 నుంచి 10 గంట లవరకు మాత్రమే పాలు, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అవకాశమిచ్చారు.
అయితే పోయిన సారి లాక్ డౌన్ తో బిక్కచచ్చిపోయిన మందు బాబులు ఈసారి ముందుగానే సుదులాయించుకుంటున్నారు. కేసీఆర్ తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటన చేసిన వెంటనే మందుబాబులు వైన్స్ వద్దకు పరుగులు పెట్టారు. భారీగా క్యూలు కట్టారు. ఇప్పుడు హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని మద్యం దుకాణాల వద్ద భారీ సంఖ్యలో జనాలు క్యూ కట్టడం కనిపిస్తోంది. హైదరాబాద్ లోని కొన్ని మద్యం షాపుల వద్ద దాదాపు కి.మీ మేర మందుబాబులు బారులు తీరడం కనిపించింది.
మందుషాపుల యజమానులు తమ ప్రైవేటు సిబ్బందితో రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. కనీస భౌతిక దూరం పాటించకుండా మద్యం కోసం పోటీపడడం గమనార్హం. హైదరాబాద్ పరిధిలోని ప్రతి మద్యం షాపు వద్ద భారీగా రద్దు నెలకొంది.
ఇక తెలంగాణలో లాక్ డౌన్ తో ఉదయం 10 గంటలలోపే మాత్రమే జనాలకు కాస్త రిలాక్స్ ఇచ్చారు. ఆ సమయంలో బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు తెరిచే అవకాశాలు లేవని అబ్కారీ అధికారులు తెలిపారు. లాక్ డౌన్ పై ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాల అనంతరం మద్యం దుకాణాలు తెరిచే సమయాలపై అబ్కారీ శాఖ నిర్ణయం తీసుకోనుంది.