https://oktelugu.com/

మద్యం షాపులపై జగన్ మరో కీలక నిర్ణయం!

    మద్యం ధరలు పెంచడంలో, మద్యం షాపులను తగ్గించండంలో ఏపీ సీఎం జగన్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా మద్యం షాపులపై జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపులను మరో పదమూడు శాతం తగ్గిస్తున్నట్లు సీఎం నిర్ణయం తీసుకోవడం విశేషం. మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఇరవై శాతం షాపులు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం మరో పదమూడు శాతం షాపులను తగ్గించింది. దీంతో మొత్తం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 9, 2020 7:57 pm
    Follow us on

     

     

    మద్యం ధరలు పెంచడంలో, మద్యం షాపులను తగ్గించండంలో ఏపీ సీఎం జగన్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా మద్యం షాపులపై జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం షాపులను మరో పదమూడు శాతం తగ్గిస్తున్నట్లు సీఎం నిర్ణయం తీసుకోవడం విశేషం. మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఇరవై శాతం షాపులు తగ్గిస్తామని చెప్పిన ప్రభుత్వం మరో పదమూడు శాతం షాపులను తగ్గించింది. దీంతో మొత్తం 33 శాతం షాపులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లయింది.

    మొత్తంగా జగన్ సీఎం పీఠం ఎక్కిన తర్వాత 4,380 మద్యం షాపులను 2,934కి తగ్గించారు. తాజా నిర్ణయం ఈ నెలాఖరు నాటికి షాపులను తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే 43వేల బెల్టు షాపులను తొలగించడంతో పాటు, 40 శాతం బార్లును గతంలోనే తగ్గించింది. ఏడాదికి 20 శాతం చొప్పున ఐదేళ్లలో నూటికి నూరుశాతం మద్యం దుకాణాలు ఎత్తివేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.