Homeఆంధ్రప్రదేశ్‌Liquor Policy AP: మద్యంపై ఏపీ సర్కారు ‘థియరీ’ సామాన్యులకు అర్థమయ్యేనా?

Liquor Policy AP: మద్యంపై ఏపీ సర్కారు ‘థియరీ’ సామాన్యులకు అర్థమయ్యేనా?

Liquor Policy AP: తాము అధికారంలోకి వస్తే మద్యనిషేధం చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఏపీలోని అక్కచెల్లెళ్లకు హామీ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా నేటికీ మద్యం నిషేధం ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. దీనికితోడు మద్యం షాపులను తగ్గిస్తున్నామనే సాకుతో మద్యం రేట్లను భారీగా పెంచి ప్రభుత్వం ఖజనా నింపుకునే ప్రయత్నం చేస్తోందని అన్నివర్గాల నుంచి విమర్శలకు తావిస్తోంది.

Liquor Policy AP
Liquor Policy AP

మద్యం రేట్లు చూస్తేనే షాక్ కొడుతుందని జగన్మోహన్ రెడ్డి గతంలోనే చెప్పారు. రేట్లు పెంచడం వల్ల మద్యంబాబు మందు మానేస్తారనేది జగన్మోహన్ రెడ్డి వాదన. కానీ ఆచరణలో మాత్రం ఇది ఏమాత్రం జరుగలేదని మద్యంపై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని చూస్తే చదువురాని వాడికి కూడా అర్థమైపోతుంది. మరోవైపు ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టుపెట్టి పెద్దమొత్తంలో రుణాలు తీసుకురావడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: CM Jagan: ఒంటరిపోరు మళ్లీ కలిసి వస్తుందా?

వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం రేట్లను ఓ పద్ధతిపాడు లేకుండా పెంచేసి మద్యంబాబు జేబులకు చిల్లుపెట్టింది. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఈక్రమంలోనే కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం మద్యంపై వ్యాట్ ను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మద్యంబాబులు సంబురాలు చేసుకున్నారు. మద్యంపై రేట్లను తగ్గించారని భావించారు. అయితే వ్యాట్ ను తగ్గించిన ప్రభుత్వం స్పెషల్ మార్జిన్ పేరుతో ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ నుంచి వసూలు చేసుకునేలా ప్రత్యేక ఆర్డినెన్స్ రూపొందించారు.

AP Liquor Business
AP Liquor Business

ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు సజావుగా సాగాలంటే ప్రభుత్వం వీలైనంత వరకు అప్పులపైనే ఆధారపడుతోంది. ఇప్పటికే అందికడల్లా అప్పులు చేసిన ప్రభుత్వం మద్యంపై వచ్చే ఆదాయాన్ని చూపి భారీగా రుణాలను తీసుకుంటోంది. వ్యాట్ ను తగ్గించి స్పెషల్ మార్జిన్ పేరుతో ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ నుంచి రాబడుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని విమర్శలు రావడంతో కేంద్రం సైతం ఏపీ సర్కారుకు మొట్టికాయలు వేసినట్లు తెలుస్తోంది.

అయితే ఏపీ అప్పులు తెచ్చుకోవాలంటే ఇంతకంటే గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలోనే ప్రభుత్వం మద్యంబాబులను పాతికేళ్లపాటు రుణాల కోసం తాకట్టు పెట్టింది. అంతేకాకుండా మద్యంపై మరింత ఆదాయం రాబట్టేలా చర్యలు చేపడుతోంది. అప్పుల కోసం ప్రభుత్వం ఎన్నిరకాల జిమ్మిక్కులు చేయాలో అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వం దూకుడు చేస్తుండే మద్యనిషేధం ఏమోగానీ రాబోయో రోజుల్లో ఏపీ మద్యాంధ్రప్రదేశ్ గా మారడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: Liquor Deaths: వైసీపీ తప్పుడు మద్యం విధానంతో పేదలు బలి

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

5 COMMENTS

  1. […] BJP Social Media Controversy: సామాజిక మధ్యమాల ప్రభావం అంశం మరోసారి పార్లమెంట్ ను కుదిపేసింది. మరోమారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ వేదికగా సోషల్ మీడియాపై అక్కసు వెళ్లగక్కింది. బీజేపీ ఫేస్ బుక్, ట్విటర్లను వాడుకుని ఎన్నికల్లో లబ్ధిపొందిందని ఆరోపణలు చేసింది. ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వాపోయింది. దీంతో సభలో దుమారం రేగింది బీజేపీ తీరుపై ప్రతిపక్షాలు గోల చేశాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బీజేపీ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా సోషల్ మీడియాను వాడుకుని అధికారం చేజిక్కించుకున్నారని దుయ్యబట్టారు […]

  2. […] Miss World 2021 Winner:  ప్రపంచ సుందరికి ఉండే ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిస్ వరల్డ్ కావడానికి ముద్దుగుమ్మలు అంతా దేశదేశాల నుంచి పోటీ పడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ పోటీల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. 2021కి గాను 70వ మిస్ వరల్డ్ పోటీలు ప్యుర్తోలోకోలో నిర్వహించారు. కాగా ఈ పోటీల్లో ప్రపంచ దేశాల నుంచి అందగత్తెలు పోటీ పడ్డారు. […]

  3. […] Kapu Reservation: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాలను చేజిక్కించుకొని తనకు ఎదరులేదని నిరూపించింది. ఒక్క పంజాబ్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలను హస్తగతం చేసుకున్న బీజేపీ తాజాగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణపై దృష్టిసారించింది. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదిగింది. ఏపీలో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా లేనప్పటికీ కేంద్రం అండగా ఏపీని కాపు కాసేందుకు రెడీ అవుతోంది. […]

  4. […] Holi Festival Importance: మన పండుగల విశిష్టత గురించి తెలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. హిందూ సంప్రదాయం ప్రకారం మన పండుగలకు ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మన పండుగల్లో ఉన్న వైవిధ్యం ఎక్కడా కనిపించదు. మనిషిలోని ఆచార వ్యవహారాలకు పండుగలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే కాలానుగుణంగా పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ. పంటలు చేతికి వచ్చే సమయంలో సంక్రాంతి, పూలు పూసే సమయంలో దసరా, ఆరు రుచుల సమ్మేళనంతో నిర్వహించే ఉగాది లాంటి పండుగలను మనం జరుపుకుంటాం. వాటిలో ఉండే ప్రాముఖ్యతను ఆస్వాదిస్తూ ఆనందంగా జరుపుకుంటాం. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular