Communists Party Kodandaram: మునుగోడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పార్టీలు విజయం కోసం పావులు కదుపుతున్నాయి. వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని తమ కార్యాచరణకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. నల్గొండ జిల్లాల కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో వారి ప్రాపకం కోసం పాకులాడుతున్నాయి. మునుగోడులో దాదాపు ఇరవై వేల ఓట్లు కమ్యూనిస్టులకు ఉంటాయని తెలియడంతో అటు గులాబీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు తమకు అనుకూలంగా చేసుకోవడానికి వారి మద్దతు తమకే అని ప్రకటిస్తున్తున్నాయి. ఈ నేపథ్యంలో వారు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
Also Read: YSRCP: వైసీపీని వీడని కూలన్మోదం..జనసేనపై విష ప్రచారం
మునుగోడులో కమ్యూనిస్టుల ఓటుబ్యాంకు ఉండటంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వారిని ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్నాయి. వారి మద్దతు ఉంటే విజయం తమదే అనే ఉద్దేశంతో రెండు పార్టీలు వారిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయి. దీంతో స్థానిక నేతలు ఒక వైపు జాతీయ నాయకత్వం మరోవైపు ప్రకటనలు చేయడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఇందులో కమ్యూనిస్టులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. రెండు పార్టీలు కమ్యూనిస్టుల మద్దతు కోసం వేచి చూస్తున్నాయి.
Also Read: Janasena Target Fix: ఆ మంత్రులను గెలవనివ్వం..జనసేన టార్గెట్ ఫిక్స్
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మద్దతు కోసం వెళ్లి కలిశారు. వారి విన్నపానికి త్వరలో సమాధానం చెబుతామని ఆయన ప్రకటించారు దీంతో కాంగ్రెస్ పార్టీ అటు కోదండరామ్, ఇటు కమ్యూనిస్టు పార్టీతో కలిసి మునుగోడులో విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. కానీ కమ్యూనిస్టులు మాత్రం ఎటూ తేల్చుకోవడం లేదు. ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై మల్లగుళ్లాలు పడుతోంది. మునుగోడులో ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే రాజకీయ పార్టీలు కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయి.
Also Read: Chandrababu Delhi Tour: ఢిల్లీ టూర్లకు చంద్రబాబు రెడీ… వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా..
కోదండరామ్ మద్దతుతో కమ్యూనిస్టుల అండతో విజయం సాధించాలని చూస్తోంది. టీఆర్ఎస్ కూడా కమ్యూనిస్టులతో కలిసి నడవాలని చూస్తుండటంతో వారి మద్దతు ఎవరికి ఉంటుందో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో మునుగోడులో తమ ప్రభావం చూపించాలని మూడు పార్టీలు నిర్ణయించుకున్నాయి. బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి నిర్ణయం కావడంతో ఇంకా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ప్రస్తుతం కమ్యూనిస్టుల అండ ఎవరిపై ఉంటుందో అంతుచిక్కడం లేదు. దీంతో మునుగోడు ఫలితం ఎలా ఉంటుందోననే ఆశ్చర్యం అందరిలో కలుగుతోంది.