Yechury Sitaram: సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి శ్వాసకోశ సమస్యలతో గత నెలలో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఆయన చికిత్స పొందుతున్నారని సీపీఎం (ఎం) పార్టీ తెలిపింది. ‘అతను శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు. మల్టీ డిసిప్లినరీ డాక్టర్ల బృందం ఆయన పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉంది.’ అంటూ పార్టీ ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన రిలీజ్ చేసింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్ లోని అత్యవసర విభాగంలో చేరారు. న్యుమోనియా కారణంగా ఆయన హాస్పిటల్ లో చేరారని, సీరియస్ గా ఏమీ లేరని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఏచూరీ ఇటీవల కంటిశుక్లం శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం జమ్ము కశ్మీర్‌లో సీపీఐ(ఎం), కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సంఘీభావ సందేశాన్ని ఏచూరి హాస్పిటల్ లో పడక ముందే పోస్ట్ చేశారు. అతను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో సభ్యుడు. ఈ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఏడాదికి అంటే 1975లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లో చేరాడు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యూ)లో విద్యార్థిగా ఉన్న సమయంలోనే ఎమర్జెన్సీ వచ్చింది. ఆ సమయంలో ఏచూరీ అరెస్టయ్యాడు. 1977 – 1988 మధ్య మూడు సార్లు జెఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేశాడు.
జెఎన్‌యూలో వామపక్షాల ఉనికిని బలోపేతం చేసిన ఘనత ప్రకాశ్ కారత్‌తో పాటు ఏచూరీకే దక్కుతుంది. మాజీ ప్రధాన కార్యదర్శి హరికిషన్ సింగ్ సుర్జీత్ సంకీర్ణ నిర్మాణ వారసత్వాన్ని సమర్థించినందుకు ఏచూరీ గుర్తింపు పొందారు. అతను 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని రూపొందించాడు. 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఇటీవల, ఏచూరి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలను సంధించడం ప్రారంభించాడు. ఆర్ఎస్ఎస్ సిబ్బందిని ప్రభుత్వంలోకి చొప్పించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
సీతారాం ఏచూరి ఎవరు?
సీతారాం ఏచూరి తనకు ఊహ తెలిసినప్పటి నుంచే విప్లవ భావాలు పునికి పుచ్చుకున్నాడు. పోరాటంతోనే ఏదైనా సాధ్యం అవుతుందని గట్టిగా నమ్మిన నేత. స్టూడెంట్ నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. 1975లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI)లో సభ్యత్వం తీసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది పాటు అందులో వివిధ హోదాల్లో పని చేశారు. సంవత్సరం తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లో చేరారు.
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యూ)లో విద్యార్థిగా ఉన్న సమయంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీంతో ఆయనను అప్పటి ఇందిరా ప్రభుత్వం జైలులో వేసింది. 1977 నుంచి 1988 మధ్య మూడు సార్లు స్టూడెంట్స్ యూనియన్ జేఎన్‌యూ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు.
Comrade Sitaram Yechury’s health condition pic.twitter.com/NDPl8HE8K0
— CPI (M) (@cpimspeak) September 10, 2024
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Latest bulletin on cpm leader sitaram yechurys health condition
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com