Homeఆంధ్రప్రదేశ్‌Lakshmi Parvathi: ఎన్టీఆర్ కుటుంబం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు

Lakshmi Parvathi: ఎన్టీఆర్ కుటుంబం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు

Lakshmi Parvathi:  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ చేసిన ఆరోపణలపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. నందమూరి కుటుంబం యావత్తు వైసీపీ తీరుపై తప్పు పడుతుంటే లక్ష్మీపార్వతి మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆనాడు ఎన్టీఆర్ పై చెప్పుల దండ వేయించినప్పుడు మీ బంధుప్రీతి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఎవరో ఒకరి మాయలో పడి నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారని చెబుతున్నారు. భువనేశ్వరి అంటే నాకు కూడా గౌరవం ఉందని, ఆమెపై నిజంగా ఆరోపణలు వస్తే నేను కూడా ఖండిస్తానని పేర్కొనడం గమనార్హం.
Lakshmi Parvathi
ఎన్టీఆర్ కుటుంబం అంతా బాలయ్య మాటలు వింటూ తప్పు దారిలో నడుస్తున్నారని ఆరోపించారు. తెలుగు జాతి అంటేనే ఎన్టీఆర్ కాదా అని ప్రశ్నించారు. మామను మోసం చేసి గద్దెనెక్కిన బాబుకు ప్రస్తుతం కష్టాలు వెన్నంటాయని తెలుస్తోందన్నారు. ఎన్టీఆర్ చనిపోయినప్పుడు బాబు నాకు ఫోన్ చేసి దేశం విడిచి వెళ్తే డబ్బు ఇస్తానని చెప్పారని గుర్తు చేశారు. కావాలంటే ఆయనను అడగాలని సూచించడం తెలిసిందే.

ఎన్టీఆర్ మరణానికి కారకులు చంద్రబాబే అని విమర్శించారు. తండ్రికి అండగా నిలవాల్సిన బాలకృష్ణ పట్టించుకోలేదు. దీంతో ఆయన కలత చెంది మనోవేదనతోనే ప్రాణాలు విడిచారు. చంద్రబాబు లక్షల కోట్లు వెనకేసుకుని మమ్మల్ని వీధిన పడేశారు. దీంతో ఆ పాపమే ఇప్పుడు బాబుకు చుట్టుకుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నా కుప్పంలో మాత్రం ఓటమి తప్పలేదు. ఫలితంగా ఆయనలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది.

Also Read: నేతల తిట్లు.. అసభ్యతకే మెట్లు.. రాష్ర్టంలో శృతిమించుతున్న రాజకీయాలు

కుటుంబ కలహాలతోనే రాజకీయం చేస్తున్నారని చూస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో భువనేశ్వరిని లాగడం బాధాకరమే. వ్యక్తిగత విషయాలపై నాయకులు తొందరపడి మాట్లాడుతూ చిక్కుల్లో పడుతున్నారని ఎద్దేవా చేశారు. నైతికతకు పెద్దపీట వేస్తూ హుందా రాజకీయాల కోసం పనిచేయాల్సిన అవసరం నేతలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.

Also Read: Narendra Modi: బీజేపీ బ్యాక్ స్టెప్ వేయ‌డం ఇది ఎన్నో సారి ?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version