YS Jagan- KTR: వారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు ఒకరు తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, ప్రస్తుతం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, మరొకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. దాయాది రాష్ట్రాలకు చెందిన ఇద్దరూ విదేశీ గడ్డపై కలిశారు. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు వెళ్లిన ఇద్దరూ సోమవారం కలుసుకున్నారు. ఒకరికొకరు షేక్‌హ్యాడ్ ఇచ్చుకున్నారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోను తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగ¯Œ గారితో గొప్ప సమావేశం జరిగింది.. అరుదైన కలయిక అంటూ ట్యాగ్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

పక్క రాష్ట్రం రోడ్లపై కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత..
హైదరాబాద్‌లో ఉంటున్న తన మిత్రుడు ఇటీవల సంక్రాంతి పండుగకు పక్కరాష్ట్రంలోని తన స్వగ్రామానికి వెళ్లాడు. అక్కడి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తిరిగి వచ్చాక తనతో చెప్పాడు అంటూ కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశే అని అప్పట్లో ప్రతిపక్షాలు జగన్‌పాలన తీరును ఎండగట్టాయి. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు కూడా తీవ్రంగా స్పందించారు. చివరకు కేటీఆర్ అర్ధరాత్రి తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. అయినా ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ మాత్రం జగన్ పాలనతీరును కేటీఆర్ వ్యాఖ్యల ఆధారంగా ఎండగట్టాయి. ఈ నేపథ్యంలో తాజగా కేటీఆర్ దావోస్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రిని కలవడం, ఆప్యాయంగా పలకరించుకోవడంతో వారు ఏం మాట్లాడుకున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: CM Jagan- KTR: ఇక్కడ తిట్లు.. అక్కడ స్నేహం.. కేటీఆర్, జగన్ సర్ ప్రైజ్
లండన్‌లో మీటింగ్ అంటూ పుకార్లు షికార్లు..
కాగా, తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దావోస్ వెళ్లకముందే లండన్‌లో కలిశారని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే జగన్ ప్రత్యేక విమానాన్ని లండన్‌లో ల్యాండ్ చేయించారని, రాత్రంతా లండన్‌లో గడిపారని పేర్కొటోంది. ఈ సమయంలోనే అప్పటికే లండన్‌లో ఉన్న మంత్రి కేటీఆర్‌ను జగన్ కలిసి ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చించారని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. లండన్ మీట్‌లో ఎంత వాస్తవం ఉందో తెలియదుగానీ, జగన్ విమానం ఇంధనం కోసం లండన్‌లో ల్యాడ్ అయిన విషయం మాత్రం వాస్తవం. రాత్రి జగన్ టీం లండన్‌లోనే ఉండడం నిజం.

కాగా దావోస్ వేదికగా అధికారికంగా కలిసిన వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు, ఏయే అంశాలపై చర్చించారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read:YSRCP MLC Anantha Babu: డెడ్ బాడీని వదలని ఎమ్మెల్సీ అనంతబాబు.. డ్రైవర్ చనిపోయాక ఏం చేశాడో తెలుసా?
[…] […]
[…] Also Read: YS Jagan- KTR: దావోస్ వేదికగా కేటీఆర్ జగన్ … […]
[…] Also Read:YS Jagan- KTR: దావోస్ వేదికగా కేటీఆర్ జగన్ … […]