అందుబాటులోకి అద్భుతమైన రిజర్వాయర్‌!

రూ.16వేల కోట్ల వ్యయం, 15టిఎంసి సామర్థం, సముద్ర మాట్టానికి 530 మీటర్ల ఎత్తు లో, 4వేల 600 ఎకరాలలో నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ పూర్తయింది. మే 29ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ ఈ రిజర్వాయర్‌ ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుతో సాగునీటి రంగంలో మరో అద్భుతం ఆవిష్కారం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో చిట్టచివరిదైన మార్కూర్ పంపు హజ్‌ నుంచి గోదావరి జలాలు పరుగులు తీస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్‌ కు చేరనున్నాయి. సముద్రమట్టానికి 530 మీటర్ల ఎత్తులో […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 11:38 am
Follow us on

రూ.16వేల కోట్ల వ్యయం, 15టిఎంసి సామర్థం, సముద్ర మాట్టానికి 530 మీటర్ల ఎత్తు లో, 4వేల 600 ఎకరాలలో నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ పూర్తయింది. మే 29ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ ఈ రిజర్వాయర్‌ ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుతో సాగునీటి రంగంలో మరో అద్భుతం ఆవిష్కారం కానుంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో చిట్టచివరిదైన మార్కూర్ పంపు హజ్‌ నుంచి గోదావరి జలాలు పరుగులు తీస్తూ కొండపోచమ్మ రిజర్వాయర్‌ కు చేరనున్నాయి. సముద్రమట్టానికి 530 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్‌ కు దశలవారిగా నీరు చేరుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి పంపు హౌజ్ అయిన మేడిగడ్డ పంపు హౌజ్ నుంచి ఇప్పటికే 88 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లి, ఆ తర్వాత మల్లన్నసాగర్ వరకు నీటిని తీసుకువచ్చారు.

మల్లన్నసాగర్ దగ్గర నుంచి ప్రత్యేకంగా నిర్మించిన కాలువలు, సొరంగాల నుంచి ఇటీవల గోదావరిజలాలు రంగనాయకసాగర్, అక్కారం చేరుకున్నాయి. అక్కారంలో మంత్రి హరీష్‌రావు మోటర్లను ప్రారంభించి ఆ నీటిని మర్కూర్ పంపిహౌజ్‌కు తరలించారు. మర్కూర్ సర్జీపూల్ దగ్గర ఇంజనీర్లు వెట్న్ పూర్తి చేసి సర్వం సిద్ధం చేశారు. ఈ సర్జీపూల్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ మోటర్ల ద్వారా నీటిని కొండపోచమ్మకు తరలిస్తారు. మర్కూర్ పంపులను ఈనెల 29న సిఎం కెసిఆర్ ప్రారంభించడంతో ఇక్కడి నుంచి గోదావరి జలాలు పరుగులు తీస్తూ కిలోమీటరు దూరంలో ఉన్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు నీరు చేరుకోనుంది.

అత్యంత ఎత్తులోకి దశలవారిగా నీటిని పంపింగ్ చేసే అద్భుత ఇంజనీరింగ్ నైపుణ్యం అడుగడుగునా అగుపిస్తోంది. 15టిఎంసి సామర్థంతో నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ వైశాల్యం 4వేల 600 ఎకరాలు ఉండగా నిర్మాణ వ్యయం రూ.16వేల కోట్లు. కొండపోచమ్మ నుంచి గోదావరిజలాలు గజ్వేల్, జగదేవ్‌పూర్, ఉప్పరపల్లి, యం.తుర్కపల్లి, చిన్నశంకరం పల్లి, రామాయంపేట, కిష్టాపూర్ కాలువల నుంచి ప్రవహిస్తూ ఐదు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయనున్నాయి. వందలాది చెరువులు, కుంటలు నింపుతూ హైదరాబాద్ తాగునీటి అవసరాలు కూడా తీర్చేందుకు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను సిఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.