Amit Shah and NTR: కేంద్రమంత్రి అమిత్ షా, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై అనేక కోణాల్లో వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ సేవలు వినియోగించుకునేందుకు బీజేపీ సిద్ధమైనట్లు మరో వార్త సంచలనంగా మారింది. దీంతో వారి భేటీపై అనేక కోణాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. వీరి భేటీపై రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. మునుగోడు సభకు హాజరైన అమిత్ షా ఎన్టీఆర్ తో అరగంట పాటు భేటీ అయ్యారు. రాష్ర్టంలో చోటుచేసుకునే పరిణామాల దృష్ట్యా వీరి మధ్య సమావేశానికి అంతటి విలువ వచ్చిందని తెలుస్తోంది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం వీరి భేటీ రాజకీయ కోణంలో కాదని సినిమా రంగానికి సంబంధించి జరిగినదే అని చెబుతున్నారు. షా, ఎన్టీఆర్ సమావేశానికి అనవసరంగా ఏదో రాజకీయ రంగు పులమాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ కు ఆస్కార్ పురస్కారం వచ్చే అవకాశమున్నందున ఎన్టీఆర్ తో అమిత్ షా సినిమా గురించే చర్చలు జరిపారని తెలుస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ మేనత్త పురందరేశ్వరి బీజేపీలో ఉండటంతో వీరి మధ్య భేటీ జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

అమిత్ షా, ఎన్టీఆర్ సమావేశంపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అమిత్ షాకు ప్రయోజనం లేనిది నిమిషం కూడా ఎవరికి కేటాయించరని ఏదో ఆశించే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోందని కుండబద్ధలు కొట్టారు. ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీకి రాజకీయ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఎన్టీఆర్ బీజేపీలో చేరి దేశవ్యాప్తంగా ఆ పార్టీ కోసం ప్రచారం చేస్తారని వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో భవిష్యత్ లో ఏం జరుగుతుందోననే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

టీడీపీతో లాభం లేదనుకుని అమిత్ షా ఎన్టీఆర్ ను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు చూస్తున్నట్లు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలవడం సాధ్యం కాదని తెలుసుకున్నాకే ఎన్టీఆర్ నైనా తమ వైపుకు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ చూపించిన నటనకు అభినందనలు తెలిపేందుకే భేటీ అయినట్లు కిషన్ రెడ్డి చెబుతున్నా ఎవరు మాత్రం విశ్వసించడం లేదు. చంద్రబాబుకు అమిత్ షా కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని నాని ఎద్దేవా చేశారు.
మొత్తానికి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ల భేటీకి ప్రచారం జోరుగానే సాగుతోంది. వీరి కలయికకు రాజకీయ కోణం ఆపాదిస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని ఊహాగానాలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఏం జరుగుతుందోననే ఆలోచన వస్తోంది.