Homeఆంధ్రప్రదేశ్‌AP Cabinet: ఉత్తరాంధ్ర మంత్రులంతా ఔట్ యేనా?

AP Cabinet: ఉత్తరాంధ్ర మంత్రులంతా ఔట్ యేనా?

AP Cabinet
AP Cabinet

AP Cabinet: ఏపీ కేబినెట్ లో కీలక మార్పులు జరగబోతున్నాయా? సీఎం కేబినెట్ మార్పునకు కసరత్తు చేస్తున్నారా? తానే స్వయంగా రంగంలోకి దిగారా? దాదాపు సజ్జలకు పక్కన పడేసినట్టేనా? ముఖ్యంగా ఉత్తరాంధ్ర మంత్రులకు ఉద్వాసన తప్పదా? నోరున్న నేతలు మంత్రులుగా లేకపోతే కష్టమని భావిస్తున్నారా? అందుకే ఇప్పుడున్న వారిలో కొంతమందిని తీసేసి పాత ముఖాల్ని తెరపైకి తేనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీలో జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఎంటెయిర్ మంత్రులను లేపేసే పనిలో జగన్ ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాభవాన్ని తట్టుకోలేకపోతున్న ఆయన కఠిన నిర్ణయాలు తీసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో మూల్యం తప్పదని భావిస్తున్నారు. అందుకే పార్టీ నేతలను నొప్పించక తప్పదంటున్నారు.

ఆ నలుగురికి ఉద్వాసన..
తొలగింపు మంత్రుల జాబితాలో సీనియర్లు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్ లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి అప్పలరాజు శుక్రవారం ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. అత్యవసరంగా పిలుపు రావడంతో ఆయన నియోజకవర్గం నుంచి హుటాహుటిన బయలుదేరి సీఎంవోకు వెళ్లారు. దీంతో ప్రసార మాధ్యమాల్లో మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై కథనాలు వచ్చాయి, వాస్తవానికి విపక్షంపై విరుచుకుపడి, బూతులు మాట్లాడే వారికి మంత్రి పదవులు లభిస్తున్నాయని ప్రచారం ఉంది. న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసినందునే అప్పలరాజుకు మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయన నచ్చకపోవడంతో ఉద్వాసన పలికేందుకు సిద్ధపడుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా స్పీకర్ తమ్మినేని సీతారాం విపక్షంపై విరుచుకుపడుతున్నారు. అందుకే ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకొని.. ధర్మానకు స్పీకర్ పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

దూకుడు తగ్గడంతో…
తొలి కేబినెట్ లో మంత్రులు దూకుడుగా ఉండేవారు. అయితే పునర్వ్యవస్థీకరణ తరువాత కొత్త మంత్రులు అంత దూకుడు కనబరచలేకపోతున్నారు. పేర్ని నాని, కొడాలి నాని స్థాయిలో కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. బూతులు కూడా తిట్టలేకపోతున్నారు. హైకమాండ్ నుంచి ఆదేశాలు వస్తే కానీ నోరు తెరవడం లేదు. మరో వైపు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం కోల్పోవడం, విశాఖ రాజధాని రెఫరెండంగా తీసుకొని ఫైట్ చేయాలని జగన్ సూచించినా ఉత్తరాంధ్ర మంత్రులు పెద్దగా పట్టించుకోలేదు. ముఖ్యంగా బొత్సపై సీఎం జగన్ సీరియస్ గా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వాన్ని కామెడీగా మార్చేస్తుండడంతో ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించాలని పట్టుదలగా ఉన్నట్టు సమాచారం. అయితే బొత్స విషయంలో అచీతూచీ అడుగులు వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్ ల మంత్రి పదవులు ఊడడం ఖాయమని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

AP Cabinet
AP Cabinet

ఈ నెల 3న స్పష్టత…
ఈ నెల 3న పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ వర్క్ షాపు నిర్వహిస్తున్నారు. కొన్ని విషయాలపై స్పష్టతనిచ్చే చాన్స్ ఉంది. ప్రధానంగా ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నిస్తారని సమాచారం. గత వర్క్ షాపులో ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికలే పంపారు. మారకపోతే మార్చేస్తానని హెచ్చరించారు. అయితే ఈ సారి అటువంటి హెచ్చరికలు పంపే అవకాశం లేదు. ధిక్కార ఎమ్మెల్యేల రూపంలో షాక్ తగలడంతో జగన్ జాగ్రత్త పడ్డారు. మరోవైపు ముందస్తుకు వెళతారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ లో కీలక మార్పులు అన్నది అనుమానమే. ఒక వేళ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళితే మాత్రం కేబినెట్ మార్పులు, చేర్పులు తప్పవు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మంత్రులకు పదవీ గండం ఖాయంగా కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version