Kerala Assembly Elections 2026: కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఏడీఎఫ్‌ను యూడీఎఫ్ ఓడించగలుగుతుందా. కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్ర కేరళ. ఈసారి యూడీఎఫ్ గెలవకుంటే కాంగ్రెస్ మరో ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సిందే. ఏడీఎఫ్ ఓడిపోతే కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రం కూడా పోతుంది. అయితే ఈసారి బీజేపీ కేరళలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 అసెంబ్లీ స్థానాల్లో మొదటి స్థానంలో నిలిచింది. వీటిలో 9 సీట్లు గెలిస్తే మూడో శక్తిగా అవతరిస్తుంది.
బీజేపీని అడ్డుకునే వ్యూహం
బీజేపీ ఎదుగుదలను అరికట్టేందుకు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ తెరవెనుక ఏకమవుతున్నాయి. ఉత్తర కేరళలోని మంజేశ్వరం నియోజకవర్గం ఇందుకు నిదర్శనం. ఇక్కడ రెండుసార్లు వరుసగా యూడీఎఫ్ గెలిచింది, రెండో స్థానంలో బీజేపీ ఉంది. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే.సురేంద్రన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో కేవలం 745 ఓట్ల తేడాతో, 2016లో 89 ఓట్లతో ఓడిపోయారు. ఈసారి ఆయనపై సానుభూతి ఉంది, యూడీఎఫ్ అభ్యర్థిపై వ్యతిరేకత ఉంది. దీంతో సురేంద్రన్ గెలుపుకు యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
పోటీ నుంచి తప్పుకున్న ముస్లిం పార్టీలు..
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) వారసురాలు ఎస్డీపీఐ వామపక్ష కూటమితో జతకట్టింది. 139 సీట్లలో ఎల్డీఎఫ్‌తో ఉండగా, ఒక్క సీటులో మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది. మంజేశ్వరంలో ఎల్డీఎఫ్ ఎస్డీపీఐకి టికెట్ ఇవ్వగా, అది పోటీ నుంచి తప్పుకుంది. మరో ముస్లిం పార్టీ ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షుడు కోయంబత్తూర్ అద్వానీ హత్య కుట్ర కేసులో ఉన్న వ్యక్తితో సంబంధం ఉన్న వ్యక్తి. పీడీపీ కూడా పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో యూడీఎఫ్–ఎస్డీపీఐ కలిసి పోటీ చేశాయి. ఇవన్నీ బీజేపీని అడ్డుకునే వ్యూహంలో భాగమే.
బీజేపీ ఎదుగుదలకు సవాళ్లు
2014లో 11 శాతం ఓట్లు వచ్చిన బీజేపీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో 20 శాతం దాటింది. 18 స్థానాల్లో మొదటి స్థానంలో నిలిచింది. అమిత్ షా 40 శాతం ఓట్లు, సీఎం పదవి లక్ష్యంగా ప్రకటించారు. కానీ యూడీఎఫ్–ఎల్డీఎఫ్ ధ్రువీకరణ రాజకీయాలు బీజేపీ మార్గాన్ని అడ్డుకుంటున్నాయి. మంజేశ్వరం లాంటి చోట్ల ముస్లిం ఓట్లు చీలకుండా చూసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ గెలుచుకోవడం చారిత్రాత్మక విజయం.
సర్వేలో యూడీఎఫ్ ముందంజ..
తాజా సర్వేల ప్రకారం, యూడీఎఫ్ 81–86 సీట్లు, ఎల్డీఎఫ్ 51–59 సీట్లు, బీజేపీ 0–2 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఓటు శాతం: యూడీఎఫ్ 43–45 శాతం, ఎల్డీఎఫ్ 39–41 శాతం, ఎన్డీఏ 13–15 శాతం, ఉత్తర కేరళలో మలప్పురం వంటి జిల్లాల్లో యూడీఎఫ్ ఆధిక్యం, కన్నూర్, పాలక్కాడ్‌లో ఎల్డీఎఫ్ బలం కొనసాగుతుంది. మధ్య కేరళలో త్రిసూర్, ఎర్నాకులం జిల్లాల్లో యూడీఎఫ్‌కు అవకాశాలు మెరుగుగా ఉన్నాయి.
సురేంద్రన్ గెలిస్తే కేరళలో బీజేపీ మూడో శక్తిగా నిలుస్తుంది, రాజకీయ సమీకరణాలు మారతాయి. యూడీఎఫ్ గెలిస్తే 10 ఏళ్ల తర్వాత అధికారం తిరిగి వస్తుంది. ఎల్డీఎఫ్ ఓడిపోతే కమ్యూనిస్టు పాలన ఒక్క రాష్ట్రంలో కూడా మిగలదు. స్థానిక ఎన్నికల్లో యూడీఎఫ్ గెలుపు (4 మున్సిపాలిటీలు) ఆశాజనకం. కానీ బీజేపీని అడ్డుకునే కూటమి ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారవచ్చు. మంజేశ్వరం ఫలితం కేరళ రాజకీయాల దిశను నిర్ణయిస్తుంది.