KCR: తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అప్పటికప్పుడు కొత్త వ్యూహాలను తెరమీదకు తెస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఇక సీఎం కేసీఆర్ తన రూటు చేంజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇ్పటి వరకు కేసీఆర్ అంటే ప్రగతిభవన్ లేదంటే ఫామ్ హౌస్ కే పరిమితం అనే విమర్శలు అటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి వినిపించేవి. కానీ ఇప్పుడు ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఇప్పటి నుంచే జిల్లాల పర్యటన స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఇలా అనూహ్యంగా జిల్లాల పర్యటన పెట్టుకోవడంతో కేసీఆర్ మళ్లీ ముందస్తు ఆలోచన చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో 2018లో కూడా ఇలాగే ఎవరూ ఊహించని విధంగా ముందస్తుకు వెళ్లి సంచలన విజయం సాధించారు. అందరి అంచనాలను తలకిందులు చేసేశారు కేసీఆర్. ఇప్పుడు మరోసారి ఇదే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రంలో టీఆర్ ఎస్ మీద పెరుగుతున్న వ్యతిరేకత, దాంతో పాటే బీజేపీ భవిష్యత్‌లో టీఆర్ ఎస్‌కు పోటీ ఇస్తుందనే టెన్షన్ ఉంది. ఇకపోతే కాంగ్రెస్ కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈరెండు పార్టీలు కలిసి తనకు ఎక్కడ అధికారాన్ని దూరం చేస్తాయో అనే భయం టీఆర్ ఎస్‌లో ఉంది. రోజురోజుకూ ఈ రెండు పార్టీలు పుంజుకోవడంతో ఇప్పటి నుంచే తన మీద వ్యతిరేకతను తగ్గించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంట.
Also Read: Dating Survey 2021: టాప్ ప్లేస్ లో మహానగరం.. ఎందులో అనుకుంటున్నారు.. డేటింగ్ లో..
కాగా కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ మీద కూడా రైతుల్లో, ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. కాబట్టి దీన్ని అవకాశంగా మలుచుకుని బీజేపీకి రాష్ట్రంలో చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారంట. దళిత బంధు స్కీమ్‌ను కొంతమేర అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారంట. డిసెంబర్ 19 నుండే వనపర్తి జిల్లాలో స్టార్ట్ చేసి నాగర్‌కర్నూలు అలాగే నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్లో జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు కేసీఆర్. కాగా ఈ కార్యక్రమాలు మొత్తం కేసీఆర్ ప్లాన్ ప్రకారమే పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read: Inter 1st Year Results: ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై ఆందోళన.. ప్రభుత్వంపై నిరసన