https://oktelugu.com/

KCR – Revanth -Bandi Sanjay : కేసీఆర్ కట్టుడు.. రేవంత్ ‘ప్రగతిభవన్’ పేల్చుడు.. బండి సంజయ్ ‘సెక్రటేరియట్’ కూల్చుడు..

KCR – Revanth -Bandi Sanjay : ఎవరు అధికారంలో ఉంటేవారి మార్క్ పాలనలో ఉంటుంది. కేసీఆర్ కు వాస్తు ప్రకారం పాలన భవనాలు ఉండాలని ఎన్ని కోట్లు అయినా సరే మొదట ప్రగతిభవన్ కట్టాడు. ఆ తర్వాత కూలగొట్టి మరీ సెక్రటేరియట్ కడుతున్నాడు. అక్కడ మోడీ పార్లమెంట్ ను ఎంత ప్రతిష్టాత్మకంగా కడుతున్నాడో ఇక్కడ కేసీఆర్ అంతకుమించి కట్టేస్తున్నాడు. అయితే కేసీఆర్ డిజైన్ లో ఇస్లాం సంస్కృతి సంప్రదాయాలు ఉండడాన్ని బీజేపీ తప్పుపడుతోంది.తాజాగా బండి సంజయ్ ఏకంగా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2023 / 05:09 PM IST
    Follow us on

    KCR – Revanth -Bandi Sanjay : ఎవరు అధికారంలో ఉంటేవారి మార్క్ పాలనలో ఉంటుంది. కేసీఆర్ కు వాస్తు ప్రకారం పాలన భవనాలు ఉండాలని ఎన్ని కోట్లు అయినా సరే మొదట ప్రగతిభవన్ కట్టాడు. ఆ తర్వాత కూలగొట్టి మరీ సెక్రటేరియట్ కడుతున్నాడు. అక్కడ మోడీ పార్లమెంట్ ను ఎంత ప్రతిష్టాత్మకంగా కడుతున్నాడో ఇక్కడ కేసీఆర్ అంతకుమించి కట్టేస్తున్నాడు. అయితే కేసీఆర్ డిజైన్ లో ఇస్లాం సంస్కృతి సంప్రదాయాలు ఉండడాన్ని బీజేపీ తప్పుపడుతోంది.తాజాగా బండి సంజయ్ ఏకంగా కొత్త సెక్రటేరియట్ గుమ్మటాలను (గోపురాల)ను పేల్చేస్తానన్న మాట సంచలనమైంది.

    తెలంగాణ సీఎం కేసీఆర్ ఓవైపు తెలంగాణకు ప్రతిష్ట తీసుకురావాలని భారీ నిర్మాణాలు చేపడుతుంటే మేం అధికారంలోకి వస్తే కూల్చేస్తామంటూ మరోవైపు కాంగ్రెస్, బీజేపీ చీఫ్ లు సంచలన ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. నిన్న ప్రగతిభవన్ ను పేల్చేస్తామంటూ రేవంత్ రెడ్డి అంటే.. ఈరోజు ఏకంగా కొత్త సచివాలయం గుమ్మటాలను కూల్చేస్తానంటూ బండి సంజయ్ అంటున్నారు.

    టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య మాటల యుద్ధంతో తెలంగాణ రాజకీయాలు ఆల్‌టైమ్‌ పతాకస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ సెక్రటేరియట్‌ గుమ్మటాలను కూల్చేస్తామంటూ బీజేపీ తెలంగాణ విభాగం చీఫ్ బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

    వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. మేము ప్రస్తుత సచివాలయం డూమ్‌లను పేల్చివేసి, కొత్త దానిని నిర్మిస్తామంటూ బండి సంజయ్ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.

    కొత్తవి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మిస్తామని బండి అన్నారు. ప్రగతి భవన్‌ను కూడా ప్రహ దర్బార్‌గా మార్చనున్నామని తెలిపారు.

    కేసీఆర్ ది నిజాం పాలన లాంటిది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నింటినీ మారుస్తామని బండి తెలిపారు.

    తెలంగాణ ప్రభుత్వంపై బండి చేసిన ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. కొత్త తెలంగాణ సచివాలయం టిఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్టులలో ఒకటి. ముస్లిం సంప్రదాయ ఆకారంలోని గోపురాలను పేల్చివేస్తామని బిజెపి ప్రతిజ్ఞ చేయడం చర్చనీయాంశమైంది.

    ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ కూలుస్తానన్నాడు. ఇప్పుడు బండి సంజయ్ సెక్రటేరియట్ కూలుస్తానంటున్నాడు. ఇలా ముగ్గురు నేతలు పంతాలు పట్టింపులకు పోకుండా ప్రజాసమస్యలపై దృష్టి సారిస్తే   మంచిదని పలువురు హితవు పలుకుతున్నారు.