https://oktelugu.com/

TRS party office in Delhi: టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో అపూర్వ విజయం

TRS party office in Delhi: ఢిల్లీలో (Delhi) టీఆర్ఎస్ (TRS) పార్టీ కార్యాలయ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దంపతులు గురువారం మధ్యాహ్నం 1.48 గంటలకు భూమి పూజ చేయనున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్ననేతలు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ నేతలు అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దక్షిణాది నుంచి ఏ ప్రాంతీయ పార్టీకి కూడా లేని పార్టీ కార్యాలయం […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 2, 2021 / 10:41 AM IST
    Follow us on

    TRS party office in Delhi: ఢిల్లీలో (Delhi) టీఆర్ఎస్ (TRS) పార్టీ కార్యాలయ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దంపతులు గురువారం మధ్యాహ్నం 1.48 గంటలకు భూమి పూజ చేయనున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్ననేతలు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ నేతలు అక్కడే మకాం వేసి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దక్షిణాది నుంచి ఏ ప్రాంతీయ పార్టీకి కూడా లేని పార్టీ కార్యాలయం ఒక్క టీఆర్ఎస్ కే దక్కడం తో పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. వసంత్ విహార్ ల నిర్వహించే పార్టీ కార్యాలయ పనులను దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ సూచనతో వర్షం కురుస్తుందని తెలియడంతో రెయిన్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

    మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో ఏర్పాట్లు చూస్తున్నారు. ముఖ్యమంత్రి దంపతులు బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. వారి వెంట రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు. ముఖ్యమంత్రికి విమానాశ్రయంలో టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి విమానాశ్రయం నుంచి నేరుగా తన అధికారిక నివాసానికి చేరుకున్నారు.

    జాతీయ పార్టీలైన బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే కార్యాలయ భవనాలున్నాయి. కాంగ్రెస్ కార్యాలయం నిర్మాణంలో ఉంది. ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ కార్యాలయ భవనం కూడా నిర్మాణంలో ఉంది. కానీ తెలుగు స్టేట్లలో వైసీసీ, టీడీపీలకు సైతం సొంత కార్యాలయ భవనాలు లేవు. టీఆర్ఎస్ మాత్రం తనకు సొంత కార్యాలయ భవనం ఉండాలనే పట్టుదలతో పనులు ప్రారంభానికి చర్యలు తీసుకుంది. దీంతో దక్షిణాది నుంచి తొలిసారి ప్రాంతీయ పార్టీ కార్యాలయ భవనం ప్రారంభించడం గమనార్హం.

    కార్యాలయ శంకుస్థాపన ఏర్పాట్ల పనులను కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, రాష్ర్ట మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లోక్ సభాపక్షనేత నామా నాగేశ్వర్ రావు, ఎంపీలు వెంకటేశ్ నేత, కేఆర్ సురేష్ రెడ్డి, మాలోతు కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. భవన నిర్మాణ ప్లాన్ పై మంత్రి కేటీఆర్ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. భూమిపూజలో పాల్గొనేందుకు రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ముఖ్య నేతలు ఢిల్లీ చేరుకున్నారు.

    ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్ మెంట్ కోరింది. అనుమతి దొరికితే ప్రధాని నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షా, జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తోనూ భేటీ జరగవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో ఆయన జల వివాదాలపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో పెండింగ్ లో ఉన్న వివిధ అంశాలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న, పార్లమెంట్ లో ఆయన చిత్రపటం లపై చర్చించనున్నట్లు సమాచారం.