https://oktelugu.com/

జగన్ పై జలయుద్ధం మొదలుపెట్టిన కేసీఆర్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇన్నాళ్లు స్నేహపూర్వకంగానే మెలిగారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న నానుడిని నిజం చేస్తూ వారిలోని విద్వేషాలను బయట పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ ఏపీతో జల వివాదాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. కేబినెట్ భేటీలో కేసీఆర్ ఏమన్నారో వ్యూహాత్మకంగా మీడియాలో వచ్చేలా చేశారు. రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆర్డీఎస్ కాల్వను అక్రమంగా నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీలో కూడా ధర్నా […]

Written By: , Updated On : June 20, 2021 / 02:09 PM IST
Follow us on

KCR Jaganతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇన్నాళ్లు స్నేహపూర్వకంగానే మెలిగారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న నానుడిని నిజం చేస్తూ వారిలోని విద్వేషాలను బయట పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ ఏపీతో జల వివాదాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. కేబినెట్ భేటీలో కేసీఆర్ ఏమన్నారో వ్యూహాత్మకంగా మీడియాలో వచ్చేలా చేశారు.

రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆర్డీఎస్ కాల్వను అక్రమంగా నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీలో కూడా ధర్నా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఆ ప్రాజెక్టులను ఆపాలంటే సులువుగానే చేయవచ్చు. రాయలసీమ ఎత్తిపోతలకు ఇంతవరకు అనుమతి లేదు.

రాయలసీమ ఎత్తిపోతల కాంట్రాక్ట్ పొందింది మేఘా ఇంజినీరింగ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వానికి ఇష్టమైన కంపెనీ. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల్లో అత్యధిక మొత్తం ఆ కంపెనీకే వెళ్తుంది. తెలంగాణ రాష్ర్ట సమితి కోసం టీవీ9 లాంటి కంపెనీలను కొనుగోలు చేయడంలోనూ చురుగ్గా వ్యవహరించారు. అలాంటి కంపెనీని ఆ ప్రాజెక్టు కట్టడి చేయడం పెద్ద విషయం కాదు. ఆర్డీఎస్ కాల్వ నిర్మాణం కూడా అంతే. కానీ ఈ మార్గాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. రాజకీయంగా రచ్చ చేయడానికే ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్, జగన్ మధ్య ఇన్నాళ్లు రాజకీయంగా సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఇటీవల జల వివాదాల విషయంలో మాత్రం అభిప్రాయభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. దీనికి తోడు షర్మిల తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మీదే విమర్శలు సంధిస్తుండడంతో కేసీఆర్ కు కోపమొచ్చిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జల వివాదాలను మళ్లీ రెండు రాష్ర్టాల మధ్య రగిలిస్తేనే ఫలితం ఉంటుందని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.