KCR Mumbai Tour : కేసీఆర్ టూర్ సక్సెసా? ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం వచ్చిందా?

KCR Mumbai Tour :  తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారు.అక్కడ శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరు సీఎంలు సంచలన పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ మేరకు కార్యాచరణను కేసీఆర్ ప్రారంభించారు. దేశంలో రావాల్సిన మార్పులపై కేసీఆర్, ఉద్దవ్ చర్చించారు. అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశంలో అనేక సమస్యలు […]

Written By: NARESH, Updated On : February 20, 2022 8:22 pm
Follow us on

KCR Mumbai Tour :  తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లారు.అక్కడ శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరు సీఎంలు సంచలన పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కోరారు. ఈ మేరకు కార్యాచరణను కేసీఆర్ ప్రారంభించారు.

దేశంలో రావాల్సిన మార్పులపై కేసీఆర్, ఉద్దవ్ చర్చించారు. అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. దేశంలో అనేక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్దవ్ తో కేసీఆర్ చర్చించారు. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్న కేసీఆర్.. వైఖరి మార్పుకోకుంటే బీజేపీకి ఇబ్బందులు తప్పవన్నారు.

పక్కరాష్ట్రాలతో కయ్యాలున్నా కూడా తెలంగాణకు, మహారాష్ట్రకు మంచి అనుబంధం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో కలిసి కేసీఆర్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర తమ సోదర రాష్ట్రంగా కేసీఆర్ భావించారు. ఉద్దవ్ ఠాక్రేను హైదరాబాద్ కు రావాలని ఆహ్వానించారు.

ఇక ఈ చర్చలు ప్రారంభం మాత్రమేనని.. దేశంలో మార్పు కోసం ఏం చేసినా బహిరంగంగానే చేస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతీకార రాజకీయాలను నాశనం చేయడమే ముఖ్యమన్నారు. తెలంగాణతో కలిసి నడుస్తామని మహారాష్ట్ర సీఎం పిలుపునిచ్చారు.

అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కేసీఆర్ కలిశారు. బీజేపీపై ప్రత్యామ్మాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి అవసరమైన చర్చలు జరిపారు.

Tags