Homeఆంధ్రప్రదేశ్‌KCR -Chandrababu: చంద్రబాబు దారిలోనే కేసీఆర్... ఏపీని జల్లెడ పట్టేస్తున్నారు..

KCR -Chandrababu: చంద్రబాబు దారిలోనే కేసీఆర్… ఏపీని జల్లెడ పట్టేస్తున్నారు..

KCR -Chandrababu కేసీఆర్ తో చంద్రబాబుకి రాజకీయ వైరం ఇప్పటిది కాదు. నాడు మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంతో కేసీఆర్ టీడీపీ నుంచి వెళ్లిపోయారు. తెలంగాణ అజెండాగా టీఆర్ఎస్ ను స్థాపించి ఉద్యమ పార్టీగా తీర్చిదిద్దారు. అయినా ఎన్నోరకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించారు. అయితే మధ్యలో 2009లో మహాకూటమి రూపంలో అయిష్టంగానే చంద్రబాబుతో కలిశారు. రాష్ట్ర విభజన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటు కేసీఆర్.. ఇటు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ వారి మధ్య విభేదాలు సమసిపోలేదు. అవి కంటిన్యూ అవుతూ వచ్చాయి. అయితే ఏపీలో కంటే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా చంద్రబాబు మరోసారి మహా కూటమి కట్టారు. కేసీఆర్ ఆధిపత్యానికి గండికొట్టాలని ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. కానీ నాడు చేతిలో ప్రభుత్వం ఉండడంతో చంద్రబాబు ప్రభుత్వ నిఘా సంస్థలను ఉపయోగించారు. తెలంగాణలో విస్తృతంగా ప్రజాభిప్రాయసేకరణ చేపట్టారు. అన్ని వివరాలను రాబెట్టగలిగారు. అప్పట్లో దానిపై పెద్ద దుమారమే రేగింది. అయితే దానిని చంద్రబాబు సమర్థించుకున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని.. అదేమీ కొత్త కాదని చెప్పుకొచ్చారు. అయితే నాడు చంద్రబాబు సమర్థించిన విధానాన్నే నేడు కేసీఆర్ అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఎంటర్ చేశారు.

KCR -Chandrababu
KCR -Chandrababu

ఏపీలో బీఆర్ఎస్ ఎంటరైంది. ముగ్గురు నేతలను చేర్చుకొని నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. సంక్రాంతి తరువాత బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అటు తరువాత కార్యాలయం రద్దీగా మారుతుందని చెబుతున్నారు. సిట్టింగులు సైతం పార్టీలో చేరేందుకు ఆసక్తిచూపిస్తున్నారని కూడా ప్రకటించేశారు. అయితే ఇవన్నీ అతిగా చేస్తున్నవని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నాయి. అయితే తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం ఏపీలో ఎంటరయ్యేసరికి అందులో వాస్తవముందా అని ఆరాతీసేవారు ఎక్కువవుతున్నారు. ప్రస్తుతం పదికి పైగా ఇంటెలిజెన్స్ బృందాలు ఏపీలో ఆరాతీసే పనిలో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్ లో జోరుగా చర్చ నడుస్తోంది. ఏపీ ప్రభుత్వ పాలన, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, చేస్తున్న అభివృద్ధి, ఏ వర్గాన్ని నమ్ముకుంటే ఓటు బ్యాంకు వస్తుంది? ఇలా అన్నిరకాల విషయాలను సేకరిస్తున్నట్టు సమాచారం. అయితే మొన్నటివరకూ బీఆర్ఎస్ పార్టీ విస్తరణ చర్యలను ఏపీ నేతలు లైట్ తీసుకున్నారు. కానీ కేసీఆర్ దూకుడు చూస్తుంటే అనూహ్య నేతలు ఎవరైనా తెరపైకి వచ్చే అవకాశముందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

KCR -Chandrababu
KCR -Chandrababu

గత ఎన్నికల ముందు తెలంగాణలో ఎంటరైన ఇంటెలిజెన్స్ విభాగం అధికారులకు, బృందానికి అక్కడి పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. ఎన్నో అవాంతరాలు సృష్టించారు. ఇప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్ వారికి మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ స్నేహితుడైన జగన్ సర్కారు ఉంది కనుక స్వేచ్ఛగా వచ్చి అభిప్రాయాలను తీసుకునే చాన్స్ ఉంది. అదే సమయంలో వారు వైసీపీ నేతలతో చర్చించినా అడ్డుకోలేరు. ఎందుకంటే అటు కేసీఆర్ పై అభిమానంతో పాటు భయమూ ఉంది. అందుకే నాడు చంద్రబాబు చర్యలను గుర్తుచేస్తూ కేసీఆర్ తన బీఆర్ఎస్ విస్తరణకు కావాల్సిన అన్ని చర్యలను ఏపీలో ధైర్యంగా, అడ్డూ అదుపూ లేకుండా చేసేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular