KCR Vs BJP: బీజేపీకి భయపడ్డ కేసీఆర్.. ఇదే సాక్ష్యం!

KCR Vs BJP: సెప్టెంబరు 17.. తెలంగాణ విమోచన దినోత్సవం. ఇదొక తెలంగాణ స్వాతంత్య్ర పోరాటం..నిజాం నిరకుంశ పాలన నుంచి ‘సర్ధార్ వల్లభాయ్ పటేల్’ సారథ్యంలోని భారత సైన్యం విముక్తి కల్పించిన రోజు. అలాంటి రోజును తెలంగాణ ఎంత ఘనంగా జరుపుకోవాలి.కానీ దరిద్రం ఏంటంటే.. ఉమ్మడి ఏపీలో.. ఇప్పుడు విడిపోయిన తెలంగాణలో కేవలం ఒక వర్గం ఓట్లు పోతాయన్న పిచ్చ భ్రమలో పడి పాలించిన నేతలు ఈరోజును విస్మరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ విముక్తి రోజును […]

Written By: NARESH, Updated On : September 3, 2022 8:41 pm
Follow us on

KCR Vs BJP: సెప్టెంబరు 17.. తెలంగాణ విమోచన దినోత్సవం. ఇదొక తెలంగాణ స్వాతంత్య్ర పోరాటం..నిజాం నిరకుంశ పాలన నుంచి ‘సర్ధార్ వల్లభాయ్ పటేల్’ సారథ్యంలోని భారత సైన్యం విముక్తి కల్పించిన రోజు. అలాంటి రోజును తెలంగాణ ఎంత ఘనంగా జరుపుకోవాలి.కానీ దరిద్రం ఏంటంటే.. ఉమ్మడి ఏపీలో.. ఇప్పుడు విడిపోయిన తెలంగాణలో కేవలం ఒక వర్గం ఓట్లు పోతాయన్న పిచ్చ భ్రమలో పడి పాలించిన నేతలు ఈరోజును విస్మరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ విముక్తి రోజును తాకట్టు పెట్టేశారన్న ఆరోపణలున్నాయి.

బీజేపీ లాంటి పార్టీ లేదు కాబట్టి ఇన్నిరోజులు ఈ సెక్యూలర్ పార్టీల ఆటలు సాగాయి. కానీ నేడు కేంద్రహోంమంత్రి అమిత్ షా ముందుకొచ్చారు. ఏకంగా తెలంగాణ సర్కార్ నిర్వహించని ‘తెలంగాణ విమోచన దినోత్సవాన్ని’ కేంద్రప్రభుత్వం తరుఫున నిర్వహించడానికి పూనుకున్నారు. అంతేకాదు.. ఒకప్పుడు హైదరాబాద్ సంస్తానంలో భాగమై.. ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రలో జిల్లాలుగా ఉన్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం దక్కేలా ఆ రెండు రాష్ట్రాల సీఎంలను హైదరాబాద్ రప్పిస్తున్నారు. దీంతో ఇది జాతీయ వార్త అయ్యింది. కేసీఆర్ సర్కార్ ను డిఫెన్స్ లో పడింది. ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ విమోచన దినోత్సవం చేస్తుంటే.. మెజార్టీ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరగకపోవడంతో కేసీఆర్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

అందుకే ఈ తలనొప్పిని తగ్గించుకోవడానికి సమావేశమైన కేసీఆర్ కేబినెట్ వెంటనే ‘విలీన వజ్రోత్సవాలు’ అంటూ దీనికి ‘తెలంగాణ జాతీయ సమైక్యత’ అన్న సాఫ్ట్ పేరును పెట్టేసి సెప్టెంబర్ 16, 17,18వ తేదీల్లో మూడు రోజుల పాటు ఈ సమావేశాల నిర్వహణకు రెడీ అయ్యింది. ముస్లిం ఓటు బ్యాంకు, ఎంఐఎంను కూల్ చేయడానికే ఇలా జాతీయ సమైక్యత అంటూ విమోచన పేరును వాడకుండా కేసీఆర్ సర్కార్ పైపైన నిర్వహించడానికి రెడీ అయినట్లుగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దీన్ని బట్టి కేసీఆర్ ఖచ్చితంగా బీజేపీకి భయపడుతున్నట్టు అర్థమవుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తప్పనిసరిగా చేసేలా బీజేపీ అష్టదిగ్బంధనం చేయడంతోనే కేసీఆర్ విధి లేక ఈ కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నట్టు అర్థమవుతోంది. తొలిసారి కేసీఆర్ ఈ విషయంలో వెనకడుగు వేసినట్టుగా అర్థమవుతోంది. ఇదే ఊపు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలపడి ఇక్కడ రాజ్యాధికారం సాధించడం పక్కా అన్న అంచనాలు వెలువడుతున్నాయి.