సినిమాల్లోకి కేసీఆర్ మనవడు… నిజమేనా ?

కల్వకుంట్ల హిమాన్షు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల మనవడు. తాతకు తగ్గ మనవడు అని హిమాన్షు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు లేండి. కుర్రాడిలో కాస్త దూకుడు ఎక్కువే. చిన్నప్పటి నుండే ఈ బుడ్డోడు మీడియాలో తెగ కనిపిస్తూ బాగానే హడావిడి చేస్తున్నాడు. పైగా ఈ మధ్య అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకున్నాడు అని కూడా మీడియా తెగ మోసేసింది. మరి ఆ అవార్డు వ్యవహారం గురించి ఏమో కానీ, ఈ కుర్రాడు మాత్రం అప్పుడే ఇంటర్వ్యూలు […]

Written By: admin, Updated On : July 7, 2021 3:45 pm
Follow us on

కల్వకుంట్ల హిమాన్షు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ముద్దుల మనవడు. తాతకు తగ్గ మనవడు అని హిమాన్షు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు లేండి. కుర్రాడిలో కాస్త దూకుడు ఎక్కువే. చిన్నప్పటి నుండే ఈ బుడ్డోడు మీడియాలో తెగ కనిపిస్తూ బాగానే హడావిడి చేస్తున్నాడు. పైగా ఈ మధ్య అంతర్జాతీయ స్థాయి అవార్డు అందుకున్నాడు అని కూడా మీడియా తెగ మోసేసింది.

మరి ఆ అవార్డు వ్యవహారం గురించి ఏమో కానీ, ఈ కుర్రాడు మాత్రం అప్పుడే ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నేను రాజకీయాల్లోకి రాను అంటూ క్లారిటీగా చెప్పుకొచ్చాడు. సోషల్‌ మీడియా ద్వారా కూడా ఈ కుర్రాడు అదే విషయాన్ని మళ్లీ కాస్త గట్టిగా చెప్పాడు. నా డ్రీమ్స్ నాకు ఉన్నాయి. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోకి వెళ్లను అంటూ తేల్చి చెప్పాడు.

సరే హిమాన్షుకు రాజకీయాలపై ఆసక్తి లేదు, పైగా అతను ప్రస్తుతానికి ఆ దిశగా అసలు ఆలోచించడానికి కూడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఓకే. మరి అతగాడికి దేని మీద ఎక్కువ ఆసక్తి ఉంది ? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే, బాబుకు హీరో అవ్వాలనే బలమైన కోరిక ఉందట. ఇతగాడు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టే అవకాశం ఉందట.

ముఖ్యంగా హీరోయిజమ్ సినిమాలు అన్నా, కమర్షియల్ సినిమాలన్నా హిమాన్షుకు బాగా మక్కువ అట. అలాగే ఈ కుర్రాడికి చాలామంది ఫేవరేట్ హీరోయిన్స్ ఉన్నారట. మొత్తానికి కేసీఆర్ మనవడు సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు అన్నమాట. మరి హీరోగా ఎంట్రీ ఇస్తాడా ? లేక తన పర్సనాలిటీ దృష్ట్యా నిర్మాతగా ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి. ఏ ఎంట్రీ ఇచ్చినా సినిమా ఇండస్ట్రీలో గోల్డన్ స్పూన్ తో వచ్చిన వాళ్లు సక్సెస్ ఫుల్ గా ఎక్కువకాలం నిలబడటం కష్టమే.