https://oktelugu.com/

హైకోర్టు చెప్పినా.. కేసీఆర్ సర్కార్ ససేమిరా?

ఓవైపు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక కరోనా రోగులు చస్తున్నారు. రెమెడిసివిర్ ఇంజెక్షన్లు దొరక్క రోగులు నానా అగచాట్లు పడుతున్నారు. కేసులు జెట్ స్పీడుగా పెరుగుతూ తెలంగాణలో మరణ మృదంగం వినిపిస్తోంది. ఇంత జరుగుతున్నా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే సుమోటగా తీస్తున్న తెలంగాణ హైకోర్టు తాజాగా వీకెండ్ లాక్ డౌన్ పెట్టే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిచింది. పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా వెంటనే ఈ అంశాన్ని పరిశీలించాలని.. దీంతోపాటు ప్రస్తుతం […]

Written By:
  • NARESH
  • , Updated On : May 5, 2021 / 05:59 PM IST
    Follow us on

    ఓవైపు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక కరోనా రోగులు చస్తున్నారు. రెమెడిసివిర్ ఇంజెక్షన్లు దొరక్క రోగులు నానా అగచాట్లు పడుతున్నారు. కేసులు జెట్ స్పీడుగా పెరుగుతూ తెలంగాణలో మరణ మృదంగం వినిపిస్తోంది. ఇంత జరుగుతున్నా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి.

    ఈ క్రమంలోనే సుమోటగా తీస్తున్న తెలంగాణ హైకోర్టు తాజాగా వీకెండ్ లాక్ డౌన్ పెట్టే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిచింది. పెరిగిపోతున్న కరోనా కేసుల దృష్ట్యా వెంటనే ఈ అంశాన్ని పరిశీలించాలని.. దీంతోపాటు ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ వేళల్ని పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. రోజుకు లక్షపైనే కరోనా టెస్టులు చేయాలని సూచించింది. కేసీఆర్ సర్కార్ కు పలు ఆదేశాలు జారీ చేసింది.

    అయితే తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ మాత్రం కుండబద్దలు కొట్టేశారు. తెలంగాణలో లాక్ డౌన్ పెట్టాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయని.. లాక్ డౌన్ అవసరం లేదని చెప్పడం విశేషం. కరోనా సమస్యకు లాక్ డౌన్ పరిష్కారం కాదని స్పష్టం చేశారు.

    సీఎస్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజానీకం భగ్గుమంటోంది. ఆస్పత్రుల్లో బెడ్స్ లేక.. చికిత్సలు అందక రోగుల ప్రాణాలు పోతుంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని ప్రజలు, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.