తెలంగాణను ఏలేస్తున్న కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని దున్నేయడానికి రెడీ అవుతున్నారట.. అవును.. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న పట్టుదలను ప్రదర్శిస్తున్నాడట.. రాష్ట్రాల హక్కులను మోడీ సర్కార్ పూర్తిగా కాలరాస్తోందన్న విమర్శలు దేశంలో ఉన్నాయి. పన్ను సంస్కరణలతో రాష్ట్రాల చేతికి చిప్పను ఇచ్చాయంటారు. జీఎస్టీతో దోచుకొని ఇప్పుడు అప్పులు చేసుకోమంటున్నారు. అన్నింటిని కేంద్రం పరిధిలోకి తీసుకెళుతూ రాష్ట్రాలను బిచ్చగాళ్లను మాదిరి చేస్తున్నాయన్న అపవాదు ఉంది.
Also Read : ఆపరేషన్ ‘అడెళ్లు’..: అందుకేనా అడవుల్లో డీజీపీ మకాం?
అందుకే కాంగ్రెస్ కథ దేశంలో ముగియబోతున్న తరుణంలో బీజేపీ కబళించే రాజకీయాలను ఎదురించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే కేసీఆర్ ‘నయా భారత్’ పేరుతో జాతీయ పార్టీ పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పేరు ఇప్పటికే ఖరారైందని.. చురుగ్గా రిజిస్టర్ ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది.
జాతీయ కాంగ్రెస్, బీజేపీలకు సమదూరంలో ఉన్న పార్టీలను కలుపుకొని జాతీయ స్థాయిలో పార్టీని పెట్టి ప్రాంతీయ పార్టీలను కలుపుకొని దేశంలో బలమైన పార్టీగా అవతరించాలని కలలుగంటున్నట్టు సమాచారం.
నిజానికి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కేసీఆర్ ‘థర్డ్ ఫ్రంట్’ పేరుతో ప్రాంతీయపార్టీలను ఏకం చేశారు. కానీ బీజేపీ క్లియర్ కట్ మెజార్టీ సాధించడంతో కేసీఆర్ ఆశలు అడియాసలయ్యాయి. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో ఎలాగైనా సరే దేశంలో బలపడాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
Also Read : జగన్ బాటలో టీ.కాంగ్రెస్ భారీ ప్లాన్.?
ఇంకా నాలుగేళ్ల సమయం ఉండడంతో జాతీయ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీపై ప్రాంతీయ పార్టీలందరిలోనూ అభిప్రాయభేదాలున్నాయి. జీఎస్టీ పరిహారం సహా అన్నింటిలోనూ అన్యాయం చేస్తున్నా కేంద్రాన్ని ఏమీ అనలేని దుస్థితి. మోడీ సర్కార్ దేశంలో బలంగా ఉండడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ క్రమంలోనే కేసీఆర్ ధైర్యంగా ముందడుగు వేయడానికి రెడీ అవుతున్నారు.
ఇప్పటికే బీజేపీ దేశంలో అమెరికా తరహాలో ‘అధ్యక్ష రాజకీయాలను’ తీసుకురావడానికి రాజ్యాంగ సంస్కరణలు చేయడానికి రెడీ కాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే దేశంలో జాతీయ పార్టీలే మిగులుతాయి. ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లుతుంది. అందుకే కేసీఆర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టినట్టు సమాచారం.
ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. రాష్ట్ర పగ్గాలు.. సీఎం పీఠం కేటీఆర్ కు వెళుతుందని అంటున్నారు. మరి కేసీఆర్ తెలంగాణను ఏలినట్టే.. దేశంలోనూ తనదైన ముద్ర వేస్తారా అన్నది వేచిచూడాలి.
-నరేశ్
Also Read : హరీష్ రావు అసెంబ్లీ గైరుహాజరు పై ఊహాగానాలు?