Homeజాతీయ వార్తలుKCR: కేసీఆర్‌ బిగ్‌ప్లాన్‌.. తెరచాటు రాజకీయంలో ఆ కీలకనేత!

KCR: కేసీఆర్‌ బిగ్‌ప్లాన్‌.. తెరచాటు రాజకీయంలో ఆ కీలకనేత!

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. హ్యాట్రిక్‌పై కన్నేసిన గులాబీ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. మూడోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. కవిత అక్కడక్కడ ప్రచారంలో మెరుస్తున్నారు. కుటుంబ పార్టీ అయిన బీఆర్‌ఎస్‌లో నలుగురూ ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ, ఐదో వ్యక్తి మిస్‌ అయ్యాడు. ప్రచారంలో ఎక్కడా ఆయన కనిపించడం లేదు. ఈ విషయాన్ని విపక్ష పార్టీలతోపాటు చాలా మంది గుర్తించడం లేదు. గులాబీ బాస్‌కు అత్యంత సన్నిహితుడు.. కేసీఆర్‌ సడ్డకుని కొడుకు.. విపక్షాల భాషలో చెప్పాలంటే.. కేసీఆర్‌కు మందులో నీళ్లు కలిపి ఇచ్చే నాయకుడు సంతోష్‌రావు. తెలంగాణ సమాజానికి హ్యాపీరావుగా కూడా తెలుసు. కేసీఆర్‌ను హ్యాపీగా ఉంచడంలో ఆయనదే కీలక పాత్ర. ఇంతటి కీలక వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల వేళ ఎక్కడా కానరావడం లేదు.

తెరవెనుక రాజకీయాల్లో..
అనకు అత్యంత సన్నిహితంగా ఉండే సంతోష్‌రావును కేసీఆర్‌ రాజ్యసభ ఎంపీగా కూడా చేశారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో సంతోష్‌రావు ఆయన పక్కనే ఉంటారు. అంతర్గత వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారు. కీలక నిర్ణయాల్లో ఉద్ధండుడిగా గుర్తింపు ఉన్న సంతోష్‌రావుకు అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్‌ తెలరవేనుక రాజకీయాల బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలు, నేతల మధ్య సఖ్యత, అసంతృప్తులను బుజ్జగించడం. డబ్బుల పంపిణీ, రవాణా, పోలీస్‌ మేనేజ్‌మెంట్‌ అన్నీ తెరవెనుక సంతోష్‌రావు చూసుకుంటున్నారని గులాబీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

డబ్బులు సిద్ధం..
ఎన్నిల ప్రచారంలో ఎక్కడా కనపడకుండా.. తెరచాటు రాజకీయం చేస్తున్న సంతోష్‌రావు.. ఓటర్లకు డబ్బులు ఎలా పంపిణీ చేయాలో ఇప్పటికే వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు లేని ఎలక్షన్స్‌ లేవనేది నిజం. ఇది ఎవరు అవునన్నా.. కాదన్నా ఆగదు. కానీ, కేసీటీఆర్‌ నేను డబ్బులు పంచకుండా గెలుస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ సిరిసిల్లలో ఇటీవల నిర్వహించిన కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను డబ్బులు పంచి తెచ్చుకున్నారు. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అప్పటి నుంచి కేటీఆర్‌ డబ్బులు పంచను ఆలే మాట ఎత్తడం మానేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌.. ఆర్థిక వ్యవహారాలన్నీ తన ఆంతరంగికుడు సంతోష్‌రావుకు అప్పగించారని బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular