
Kavitha- Shailaja: ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలే తలెత్తకుండా ఉండి ఉండుంటే గురుత్వాకర్షణ శక్తి అనేది ఒకటి ఉంటుందని న్యూటన్ కనిపెట్టలేక పోయేవాడు.. కానీ ఆ ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు న్యూటన్ కు దొరికినంత ఈజీగా చాలామందికి జవాబులు దొరకవు.. ఎందుకయ్యా అంటే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ విచారిస్తోంది.. విచారణ నిమిత్తం తన ఆఫీసుకే రమ్మంటుంది. ఇప్పటికే రెండుసార్లు విచారణ జరిగింది. ఇక్కడ జరుగుతున్న చర్చ విచారణ గురించి కాదు.. “మహిళలను, విచారించే సమయంలో నేరుగా వారి ఇంటికే వెళ్లాలి. ఆఫీసులో విచారణ జరుపకూడదు” అనేది కవిత ఫిర్యాదు.. దీనిపై ఆమె సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పాల్సి ఉంది.
ఇక మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసుకు సంబంధించి ఏపీ సిఐడి విభాగం తన ఆఫీసుకు రామోజీరావును, శైలజా కిరణ్ ను పిలవలేదు. తనే వారి నివాసాలకు వెళ్ళింది.. గత కొద్ది గంటలుగా విచారిస్తోంది. మరి కవిత కోరినట్లు ఏపీ సీఐడీ లాగా ఈడి ఎందుకు విచారించకూడదు? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తే ఎవరు సమాధానం చెప్పాలి? ఇది ఆర్థిక సంబంధమైన కేసే, అది కూడా ఆర్థిక సంబంధమైన కేసే..ఇలాంటి కేసుల్లో ఈడి ఒకలాగా, సిఐడి ఒకలాగా వ్యవహరిస్తాయా? అయితే ఎందుకు? ఇదీ ఇవాళ ఉదయం నుంచి పొలిటికల్ వర్గాల్లో నానుతున్న ప్రశ్న. అయితే కవిత కేసును కూడా ఈడీ అలా సాగదీస్తూ ఉంటుంది. కెసిఆర్ తో మైండ్ గేమ్ ఆడుతూ ఉంటుంది. ఇంకేమైనా దొరుకుతాయేమోనని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ, డేటా చోరి కేసులో ప్రవేశించింది. మరి ఇందులో ఏం తవ్వుతుందో, వెతికితీస్తుందో చూడాలి.

పేపర్ లీకేజీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో ఆ వ్యవహారంలోకి ఈడీ ప్రవేశిస్తోంది. డేటా చోరీ కేసులో కూడా ఇన్వాల్వ్ కానుంది. అంతేకాదు ఇప్పుడు ఈ కేసులను విచారిస్తున్న సిట్ బృందం సమన్వయంతోనే ఈడి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. మరి ఈ కేసుల్లో ప్రవేశించిన ఈడి.. మార్గదర్శి విషయంలో ఎందుకు ఎ కాలేకపోతోంది? ఒకవేళ ఈ కేసును జగన్ సిబిఐ కి అప్పగిస్తాడా? అప్పుడు నేరుగా ప్రవేశించవచ్చని ఈడీ భావిస్తోందా? కానీ అంత తొందరగా జగన్ ఈ కేసును సీబీఐకి ఇవ్వడు. ఎందుకంటే అతడికి బిజెపికి టర్మ్స్ బాగున్నాయి. ఇది స్వతహాగానే రామోజీరావుకు నచ్చదు.. పైగా రామోజీరావుకు బిజెపికి మధ్య సంబంధాలు మంచిగానే ఉన్నాయి.. అక్కడిదాకా ఎందుకు బిజెపిలో నెంబర్ 2 అమిత్ షా హైదరాబాద్ కు వస్తే రామోజీ ఫిలిం సిటీకి వెళ్తాడు తప్ప.. రామోజీరావు వచ్చి నేరుగా అమిత్ షాను కలవడు. మోడీ స్వచ్ఛభారత్ అని ప్రోగ్రాం పెడితే రామోజీరావును ప్రత్యేకంగా ఆహ్వానించాడు.. గౌరవించాడు.. కాబట్టి ఈడి అమాంతం రామోజీరావు మీద వాలిపోదు.. మోదీ వాలనివ్వడు.
ఇక మార్గదర్శి పైన ఐపిసి 420,409, 120 బీ, 477 రెడ్ విత్ 34, కేంద్ర చిట్ ఫండ్ చట్టం 1982, ఆర్థిక సంస్థల రాష్ట్ర డిపాజిట్ దారుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ ల కింద కేసులు నమోదయ్యాయి.. మరి ఈ కేసులో జగన్ అరెస్టుల దాకా వెళ్తాడా? ఎందుకంటే కోర్టు ఆల్రెడీ కఠిన చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది.
ఒకవేళ మార్గదర్శి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అయితే జగన్ చేతులు కట్టుకొని కూర్చోవాలి. అది అతగాడికి స్వతహాగానే ఇష్టం ఉండదు. పైగా 2024 ఎన్నికల వరకు రామోజీరావు మెడమీద కత్తి వేలాడదీస్తూనే ఉండాలి. చంద్రబాబు ఆర్థిక స్తంభాన్ని ఒక్కొక్కటిగా కూల్చి వేస్తూనే ఉండాలి. అది జగన్ లక్ష్యం కాబట్టి.. ఏపీ ప్రభుత్వం అంత ఈజీగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు మార్గదర్శి కేసును అప్పగించదు. మరి జగన్ తదుపరి అడుగులు ఏమిటో చూడాలి. అసలు రామోజీరావు, శైలజా కిరణ్ ను ఏపీ సిఐడి విచారిస్తోంది అంటేనే నమ్మబుల్ గా లేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్… మార్గదర్శి ఫైనాన్స్ కేసు సుప్రీంకోర్టులో సజీవంగానే ఉంది.. ఇప్పటికే ఇందులో జగన్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. తెలంగాణ ప్రభుత్వం జస్ట్ సైలెంట్ అయింది. కవిత, శైలజవి.. ఆర్థిక సంబంధమైన కేసులే… కానీ ఎంత తేడా..