
Kavitha Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పీకల్లోతు మునిగిపోయిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బిడ్డ కల్వకుంట్లల కవిత.. ఈడీ విచారణకు హాజరు కాకుండా ఢిల్లీలో హైడ్రామాకు తెరతీశారు. ఈనెల 11న విచారణకు వెళ్లిన కవితను ఈడీ సుమారు 9 గంటలు విచారణ చేసింది. మళ్లీ 16న రావాలని నోటీసులు ఇచ్చింది. అయితే గురువారం విచారణకు వెళ్తానని మొదట చెప్పిన కవిత, ఢిల్లీలోని తన తండ్రి నివాసంలో సరికొత్త డ్రామా మొదలు పెట్టారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతిరాతోడ్, న్యాయనిపుణుల సలహాలతో విచారణను తప్పించుకునేందుకు వక్రమార్గం వెతికారు. కానీ అవేవీ ఫలించే అవకాశం లేకపోవడంతో చివరకు సుప్రీం కోర్టులో ఉన్న పిటిషన్‌ను సాకుగా చూపి విచారణకు హాజరు కాలేనని ఈడీకి తన న్యాయవాది ద్వారా లేఖ పంపించారు.
ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ..
లిక్కర్ స్కాంలో ఢిల్లీలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే ఏదో జరగబోతోందని మాత్రం అనుమానం పెరిగిపోతోంది. కవిత విచారణ అంటేనే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందుకు ఢిల్లీకి వెళుతున్నారు? ఢిల్లీలో ఎందుకింత హడావుడి చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేవలం కేసీఆర్ కూతురు కాబట్టే కవిత విచారణ సందర్భంగా ఇంతమంది ఇలా స్పందిస్తున్నారని అనుకోవాలి.
11న వెళ్లిన మంత్రులు.. మళ్లీ 16న..
ఈనెల 11వ తేదీనే కవితను ఈడీ అరెస్టు చేస్తుందని అందరు అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన హడావుడి ఆ విధంగా కనిపించింది. అందుకనే 10వ తేదీ హైదరాబాద్ లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో కేసీయార్ మాట్లాడుతూ కవితను ఈడీ అరెస్టు చేయవచ్చని ప్రకటించారు. దీంతో విచారణ విషయంలో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే ఆ రోజు అరెస్టు జరగలేదు. విచారణ ముగియగానే రాత్రికి రాత్రే కేటీఆర్, హరీశ్‌తో కలిసి కవిత హైదరాబాద్ కు వచ్చేశారు. తాజాగా 16న విచారణ ఉండడంతో మళ్లీ కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు సత్యవతి రాథోడ్ ఢిల్లీ వెళ్లారు.
ఈడీతో మైండ్‌గేమ్..
చూడబోతే యావత్ బీఆర్‌ఎస్ మొత్తం ఈడీపై మైండ్ గేమ్ ఆడుతోందా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. కవిత ఒంటరి కాదని మొత్తం బీఆర్‌ఎస్ అంతా తనకు మద్దతుగా ఉందని సంకేతాలు పంపుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గతంలో దర్యాప్తు సంస్ధలు మంత్రులు, ఎంపీలను విచారణ చేసినపుడు పార్టీ ఇలాంటి సంకేతాలు పంపలేదు. కవిత విషయంలో మాత్రం ఇలాంటి సంకేతాలు పంపుతోందని అర్థమవుతోంది. తాజాగా విచారణకు హాజరు కానని లేఖ పంపించారు. ఈ నేపథ్యంలో ఈడీ ఏం చేస్తుందో చూడాలి.