Karnataka Breakfast Politics: కర్ణాటక రాజకీయాలు కొంతకాలంగా సీఎం పోస్టు చుట్టు తిరుగుతున్నాయి. సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ వర్గీయులు రకరకాల ఆరోపణలు చేసుకుంటున్నారు. దీనికి తోడు డీకే శివ కుమార్ వర్గంలోని వారంతా ఢిల్లీ వెళ్లిపోయారు. అక్కడే మకాం వేశారు. దీంతో సీఎం మార్పు ఉంటుందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. కన్నడ మీడియా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే అధిష్టానం మాత్రం భిన్నంగా స్పందించింది. నాయకత్వ మార్పుపై కీలక ప్రకటన చేసింది.
కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసిన తర్వాత.. డీకే శివకుమార్, సిద్ధరామయ్య కర్ణాటక వచ్చారు. సిద్ధ రామయ్య ఇంట్లో డీకే శివకుమార్ అల్పాహారం తిన్నారు. ఆ సమయంలో వారిద్దరు పక్కపక్కనే కూర్చుని అల్పాహారం తింటున్న ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. ముఖ్యమంత్రి మార్పు ఏమీ లేదని.. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని.. అధికారాన్ని దక్కించుకుంటుందని పేర్కొన్నారు. పరిపాలనపై దృష్టిస్తారిస్తామని.. కర్ణాటక అభివృద్ధికి కట్టుబడి ఉంటామని.. అధికార మార్పు అనేది లేదని స్పష్టం చేశారు.
ఇటీవల ఇద్దరు కలిసి అల్పాహారం తీసుకున్న నేపథ్యంలో.. మరోసారి మంగళవారం బెంగళూరులో వారిద్దరు భేటీ అవుతారని.. ఈసారి డీకే శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్య అల్పాహారం తీసుకుంటారని సమాచారం. సిద్ధరామయ్యను డీకే శివకుమార్ ఆహ్వానించారని.. సిద్ధరామయ్య కోసం అల్పాహారం ఏర్పాట్లు ఘనంగా చేశారని కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఇద్దరు నేతలు ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు తాజాగా డీకే శివకుమార్ ఇంట్లో అల్పాహారం మీటింగ్ ఏర్పాటు పట్ల కర్ణాటక రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయో అర్థం కావడం లేదని విశ్లేషకులు అంటున్నారు.
డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడంలో కాంగ్రెస్ అధిష్టానం విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైకి వేణుగోపాల్ రెడ్డితో రకరకాల ప్రకటనలు చేస్తున్నప్పటికీ అంతర్గతంగా విభేదాలు నివురు గప్పిన నిప్పులాగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కర్ణాటకలో పరిపాలన పడకేసింది. అభివృద్ధి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఐటి రాజధాని బెంగళూరు నుంచి చాలా వరకు కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది.. డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తుందా.. ఈ ప్రశ్నలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి.