Homeజాతీయ వార్తలుMohammad Suhail: ఓ సాధారణ పెయింటర్.. కర్ణాటక వచ్చాడు.. పోలీసులు పట్టుకొని విచారిస్తే.. పాక్ తో...

Mohammad Suhail: ఓ సాధారణ పెయింటర్.. కర్ణాటక వచ్చాడు.. పోలీసులు పట్టుకొని విచారిస్తే.. పాక్ తో సంబంధాలు..

Mohammad Suhail: అతడు ఓ సాధారణ పెయింటర్. ఇతడిది ఉత్తరప్రదేశ్. కర్ణాటక వచ్చాడు. కర్ణాటక రాష్ట్రంలోని దావనగరే ప్రాంతంలో పెయింటింగ్ చేస్తున్నాడు. అక్కడ ఒక చిన్న గది అద్దెకు తీసుకొని జీవిస్తున్నాడు. రోజు పనికి వెళ్లడం.. సాయంత్రం తన గదికి రావడం.. స్నానం చేయడం.. భోజనం చేయడం.. ఇవే అతడి దినచర్య. చుట్టుపక్కల వారికి కూడా సన్నిహితుడిగా మారిపోయాడు. ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. తన పని తాను చేసుకుంటూ పోయేవాడు.

దావనగిరే ప్రాంతంలో అతడు ఓ రోజు పెయింట్ వేస్తుండగా.. ఒక్కసారిగా అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసులు ఆ స్థాయిలో రావడంతో అక్కడ ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. అక్కడితో ఒకసారి పోలీసులు రావడంతో స్థానికులు కూడా ఆందోళన చెందారు. ఏం జరిగిందో తెలుసుకునేలోగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రత్యేకమైన వాహనాలలో తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత పోలీసులు వెల్లడించిన వివరాలు యావత్ దేశాన్నే నివ్వెర పరిచాయి.

పోలీసులు అరెస్ట్ చేసిన ఆ వ్యక్తి పేరు మహమ్మద్ సుహేల్.. ఇతడికి పాతిక సంవత్సరాల వయసు ఉంటుంది. ఇతడు ఉత్తర ప్రదేశ్ లోని సహారాన్ పూర్ జిల్లాలోని గంగో పోలీస్ స్టేషన్ పరిధిలో లక్నౌటి గ్రామం. ఇతడు పెయింటర్ గా పనిచేస్తున్నాడు. వాస్తవానికి పెయింటింగ్ అనేది బయటికి చూపించే ఎక్స్పోజర్ మాత్రమే. ఇతడు ఒక కరుడుగట్టిన తీవ్రవాది. అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని బాంబుతో పేల్చి వేస్తానని ఇంటర్నెట్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక్కడికి రాడికల్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఆన్లైన్ ఇస్లామిక్ రాడికల్ గ్రూపులతో ఇతడికి సంబంధం ఉంది. వారితో నిత్యం వాట్సాప్ చాట్ చేస్తున్నాడు. ఆయుధాల గురించి కూడా చర్చిస్తున్నాడు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడింది.

సుహేల్ తో పాటు దావనగరే ప్రాంతానికి చెందిన జమీల్ ఖాన్, తమకూరు ప్రాంతాన్ని చెందిన అల్లా బక్ష్ అనే ఇద్దరు యువకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా వీరి కదలికల మీద ఉగ్రవాద నిరోధక పోలీసు బృందాలు దృష్టిపెట్టాయి. వీరు బయట కనిపించే విధానం.. అంతర్గతంగా దేశంలో కుట్రలు చేసేందుకు రూపొందించిన ప్రణాళికలు.. ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో బయటపడ్డాయి. పకడ్బందీ ఆధారాలతో పోలీసులు వీరిని పట్టుకొని జైలుకు తరలించారు.. ఇదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చే వారి మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలని.. అటువంటివారిని గుడ్డిగా నమ్మకూడదని పోలీసులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular