Homeఆంధ్రప్రదేశ్‌Kapu Reservation Case: కాపు రిజర్వేషన్లలో ట్విస్ట్..

Kapu Reservation Case: కాపు రిజర్వేషన్లలో ట్విస్ట్..

Kapu Reservation Case
Kapu Reservation Case

Kapu Reservation Case: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10% రిజర్వేషన్ల కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనిపై ఎప్పటి నుంచే కాపులు పోరాటం చేస్తున్నారు. తాజాగా హైకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణను వచ్చే నెల 26కు హైకోర్టు వాయిదా వేసింది.

కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అంశం తేలడం లేదు. గత కొన్నేళ్ళుగా కాపులు ఈ రిజర్వేషన్ల కోసం పోరాటం సాగిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పది శాతం రిజర్వేషన్లలో ఇది శాతం కాపులకు కేటాయించాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ మంత్రి చేగోండి హరి రామ జోగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరగింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.

ఎప్పటి నుంచో కోరుతున్న కాపులు..

కాపుల్లో ఆర్థికంగా వెనుకబడిన ఎంతో మందికి మేలు చేకూర్చేలా ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ కోరుతున్నారు. దీనిపై అనేక విధాలుగా పోరాటాలను సాగిస్తున్నారు. కోర్టును ఆశ్రయించడం ద్వారా మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో మాజీమంత్రి హరి రామ జోగయ్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సాగించిన కోర్టు పలు కీలక అంశాలను ప్రస్తావించడంతో పాటు కౌంటర్ పిటిషన్ వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అని పిటిషన్లు కలిపి ఒకేసారి తదుపరి విచారణలో విచారిస్తామని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టులో ముగిసిన కేసు..

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున అమలు చేయలేమంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే, తాజాగా సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు అమలు చేయాలంటూ హరి రామ జోగయ్య తరపు న్యాయవాది రాధాకృష్ణ కోర్టుకు విన్నవించారు. సుప్రీంకోర్టులో విచారణ ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వడం లేదంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Kapu Reservation Case
High Court

కౌంటర్ పిటిషన్ దాఖలకు ఆదేశం..

కాపులు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం తరఫు న్యాయవాది.. పూర్తి వివరాలతో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇకపోతే, ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఉన్న పిటిషన్ లన్ని కలిపి వచ్చే నెల 26వ తేదీన విచారణ సాగిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ రిజర్వేషన్ల అంశం ఏమవుతుందో అని సర్వత్ర ఆసక్తికరంగా మారింది.

Exit mobile version