కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడంపై టీవీలన్నీ ఊదరగొట్టేస్తున్నాయి. ఇది మీడియా హైప్ నా? నిజంగానే ఆయన ప్రభావం ఆంధ్ర రాజకీయాల్లో ఉండబోతోందా? అన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.
కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేసిన కన్నా.. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీలోకి వెళ్లబోతున్న కన్నాను పిలిచి బీజేపీ రాష్ట్ర సారధ్య బాధ్యతలు అప్పగించారు. అయితే అంతే వేగంగా ఆయన చేతి నుంచి పగ్గాలు తీసుకొని సోము వీర్రాజు చేతిలో పెట్టారు. దీంతో అప్పటి నుంచి మనస్తాపంతో ఉన్న కన్నా టీడీపీలో చేరేందుకు మొగ్గుచూపారు. అటు అవసరాల దృష్ట్యా చంద్రబాబు కూడా ఒకే చెప్పారు.
అంతవరకూ బాగానే ఉంది. కానీ బుచ్చయ్య చౌదరి, గాలిముద్దు క్రిష్ణంనాయుడు బాటలో కన్నా చేరుతారన్న టాక్ టీడీపీలో ఉంది. ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీలో ఉన్నప్పుడు చంద్రబాబును కన్నా అనరాని మాటలు అన్నారు. చాలారకాలుగా ఆరోపణలు చేశారు. తప్పకుండా వాటిని చంద్రబాబు మనసులో ఉంచుకొని ఉంటారని.. సరైనా సమయంలో దెబ్బకొడతారన్న టాక్ అయితే నడుస్తోంది.
కన్నా చేరిక విషయంలో మీడియా చేస్తున్న హడావుడిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..