Norway Journalist Controversy: నరేంద్ర మోడీ ఎవరు.. మన దేశ ప్రధాని. ఆయన పరిపాలనలో లోపాలు ఉండవచ్చు గాక.. ఆయన విధానాలలో లోపాలు ఉండవచ్చు గాక. అవి మనకు నచ్చకపోతే విమర్శించాలి. ఇబ్బందిగా ఉంటే ఆరోపించాలి. అంతేతప్ప ఆయనను పూర్తిగా వ్యతిరేకించకూడదు. కానీ నెత్తి మాసిన ప్రకాష్ రాజ్ , పనికిమాలిన ధృవ్ రాటికి అర్థం కావడం లేదు. పైగా ఉదయం లేస్తే మీరు నరేంద్ర మోడీ మీద విద్వేషాన్ని రగిలిస్తూనే ఉంటారు.
ధృవ్ రాటి ఎక్కడో జర్మనీలో ఉంటాడు. ప్రతిరోజు నరేంద్ర మోడీ మీద టన్నులకొద్దీ విషాన్ని చిమ్ముతూనే ఉంటాడు. పైగా రకరకాల వక్రీకరణలతో అదేదో బ్యాచ్ లాగా పనిచేస్తూ ఉంటాడు. యూట్యూబ్లో ఇతడికి కోటికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారంటే.. ఇతడి వెనుక ఎలాంటి గ్యాంగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక నేను ప్రశ్నిస్తూనే ఉంటా అనే వ్యక్తి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రామాయణ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు. రాముడు గురించి ఇష్టం వచ్చినట్టు కూస్తూ ఉంటాడు. ఈ స్థాయిలో మాట్లాడుతున్న ఇతడు ఏమైనా శుద్ధ పూస అంటే.. అదేమీ లేదు. భార్యకు విడాకులు ఇచ్చాడు. తనకంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈయన కూడా నరేంద్ర మోడీని విమర్శిస్తూ ఉంటాడు. నరేంద్ర మోడీ పెళ్లి చేసుకున్నాడు. చట్టబద్ధంగానే విడాకులు ఇచ్చాడు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టలేదు. ఏ మీనాడు కూడా ఆమె వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించలేదు. ఇతరుల మీద పరుష వ్యాఖ్యలు చేయలేదు. రాజకీయంగా నరేంద్ర మోడీ ప్రత్యర్థుల పట్ల విమర్శలు మాత్రమే చేశారు. వారిని ఎన్నడు కూడా శత్రువులుగా చూడలేదు. కానీ ప్రకాష్ రాజ్ మాట్లాడితే విద్వేషానికి అంగీ లాగు తొడిగినట్టు ఉంటుంది.
ప్రకాష్ రాజ్ ఆమధ్య కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు డిపాజిట్ రాలేదు. మా ఎన్నికల పోటీ చేసినప్పుడు డిపాజిట్ రాలేదు. సుప్రసిద్ధ నటుడిగా పేరుపొందిన ప్రకాష్ రాజ్.. ఏనాడు కూడా సమయానికి సెట్ లోకి రాడు. నిర్మాత డబ్బుకు విలువ ఇవ్వడు. తను వచ్చినప్పుడు షూటింగ్ మొదలు పెట్టుకోవాలనుకుంటాడు. ఇటువంటి వ్యక్తి నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ ఉంటాడు.
రాటి, ప్రకాష్ రాజ్ టూల్ కిట్ బాగోతం ఇప్పుడు బయటపడింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్టు హెల్లీ లింగ్ ను రాటి, ప్రకాష్ రాజ్ అనుసరించడం మొదలుపెట్టారు. నరేంద్ర మోడీని ప్రశ్నించక ముందు.. ఈమెకు ట్విట్టర్లో అంతగా ఫాలోవర్స్ ఉండేవారు కాదు. ఇప్పుడు ఏకంగా ఆ సంఖ్య 12వేలకు పెరిగిపోయింది. మోడీపై ద్వేషంతో ఈమెపై ప్రేమ కనబరుస్తున్న టూల్ కిట్ బ్యాచ్ కు మన దేశ ప్రధాని విలువ అర్థం కాదు. అర్థం చేసుకోలేరు. ఎంతైనా సోరోస్ స్కూల్ విద్యార్థులు కదా.. అలానే ఉంటారేమో.
