https://oktelugu.com/

Janasena Vs YCP: పవన్‌ లీగల్‌ ఫైట్‌.. ప్రభుత్వం కంటే ముందే కోర్టుకు జనసేనాని?

ప్రభుత్వ ఉద్యోగులు కాని వ్యక్తుల ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నదనేది జనసేన ప్రధాన అభ్యంతరం. అలాగే చాలా ప్రాంతాలలో వాలంటీర్లు తమ హోదాను దుర్వినియోగం చేస్తున్నారంటూ పవన్‌ పదేపదే చెబుతున్నారు. వ్యక్తిగత సమాచారం ఎవరైనా ప్రైవేటు వ్యక్తి దగ్గర ఉంటే అది క్రైమ్‌ అంటూ గతంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

Written By: , Updated On : July 24, 2023 / 11:58 AM IST
Janasena Vs YCP

Janasena Vs YCP

Follow us on

Janasena Vs YCP: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా రాజకీయాల్లో దూకుడు పెంచిన జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.. తాజాగా మరో కీలక అడుగు వేయబోతున్నారు. ఇప్పటికే తన పదునైన వ్యాఖ్యలు, ప్రశ్నలు, ప్రజా సమస్యలపై నిలదీతలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న పవన్‌.. ఇప్పుడ లీగల్‌గా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. వాలంటీర్లపై వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వం అధికారికంగా పవన్‌ కల్యాణ్‌పై పరువు నష్టం పిటిషన్‌ వేయాలనుకుంటోంది. ఇందు కోసం సంబంధిత శాఖకు అనుమతి ఇచ్చింది. కానీ జనసేనాని ప్రభుత్వం కంటే ముందే తాము కోర్టుకెళ్లాలని జనసైనికులు నిర్ణయించుకున్నారు. పవన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అదే కీపాయింట్‌తో..
ప్రభుత్వ ఉద్యోగులు కాని వ్యక్తుల ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నదనేది జనసేన ప్రధాన అభ్యంతరం. అలాగే చాలా ప్రాంతాలలో వాలంటీర్లు తమ హోదాను దుర్వినియోగం చేస్తున్నారంటూ పవన్‌ పదేపదే చెబుతున్నారు. వ్యక్తిగత సమాచారం ఎవరైనా ప్రైవేటు వ్యక్తి దగ్గర ఉంటే అది క్రైమ్‌ అంటూ గతంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

న్యాయ నిపుణులతో సంప్రదింపులు..
మరో వైపు ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లే అంశంపై .. న్యాయ నిపుణులతో జనసైనికులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం ఎలా సాధ్యం అని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కోర్టుకు వెళ్తే.. వాలంటీర్లతో ప్రభుత్వం ఏం చేయించుకుంటుందో చెప్పాలి. డేటా సేకరణ చేయించుకుంటున్నారని చెబితే మొదటికే మోసం వస్తుంది. అసలు వాలంటీర్ల వ్యవస్థ కు చట్టబద్ధత లేదు. ప్రజాధనం జీతంగా ఇస్తున్నారు. ఇప్పుడు దానికి హైకోర్టు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వారి తరపున కోర్టుకు ఎందుకు వచ్చారో కూడా చెప్పాల్సి ఉంటుంది. మరో వైపు కోర్టుకు జనసేననే ముందు వెళ్లబోతోంది. వాలంటీర్లపై వైసీపీ, జనసేన న్యాయపోరాటం ఎటు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ ఏర్పడుతోంది.